హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas: ప్రభాస్‌ సినిమాలో మరో భామ.. ఏకంగా బాలీవుడ్ బాంబ్‌ను తీసుకొచ్చారు

Prabhas: ప్రభాస్‌ సినిమాలో మరో భామ.. ఏకంగా బాలీవుడ్ బాంబ్‌ను తీసుకొచ్చారు

Prabhas Photo : Twitter

Prabhas Photo : Twitter

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికాతో పాటు.. బాలీవుడ్ బిగ్ బీ.. అమితాబ్ సైతం ప్రాజెక్టు కేలో నటిస్తున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ సినిమాల్లో ‘ప్రాజెక్ట్ కే’ ఒకటి. ఎవడే సుబ్రమణ్యం, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా సై-ఫై జోనర్‌లో తెరకెక్కుతోంది. 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు వైజయంతి మూవీస్. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై రెండు షెడ్యూల్స్ ని కూడా పూర్తి చేసుకుంది ‘ప్రాజెక్టు K’. ఇందులో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాతో తాను ప్రభాస్‌ను ప్యాన్ వరల్డ్ స్టార్‌గా మారుస్తానని నాగ్ అశ్విన్ చెప్తున్న మాటల్ని బట్టి చూస్తే.. ఈ ప్రాజెక్ట్‌పై అతడు ఎంత నమ్మకంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. ఈ ప్రాజెక్ట్‌లో మరో బాలీవుడ్ బాంబ్ జాయిన్ అయ్యారు. 'లోఫర్‌' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కథానాయిక దిశా పటాని మరోసారి ప్రభాస్‌తో కలిసి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనే బిజీ అయిపోయింది దిశ పటాని. పలు తెలుగు సినిమాల విషయంలో ఆమె పేరు తెరపైకి వచ్చినా... వాటిలో నటించడం సాధ్యం కాలేదు.

అయితే ఈసారి ఆమె ప్రభాస్‌తో జట్టు కడుతోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్‌ కె' లో దిశ కూడా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.  ఆ విషయాన్ని ఇన్‌స్టా ద్వారా బయటపెట్టింది దిశా.  దిశా పటానీకి వెల్‌కమ్‌ చెప్తూ ఆమెకు పుష్పగుచ్చంతో పాటు స్పెషల్ గిఫ్ట్ ని పంపించారు ప్రాజెక్ట్ కే చిత్ర యూనిట్. దానిపై దిశా పటానికి ‘ప్రాజెక్టు K’లోకి వెల్కమ్ అని రాసి ఉంది. దిశా ఈ స్పెషల్ గిఫ్ట్ ని ఫోటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసుకుంది

పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న 'ప్రాజెక్ట్‌ కె'లో ప్రభాస్‌కి జోడీగా దీపికా పదుకొణె నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో కీలక పాత్ర కోసం దిశా పటానీని ఎంపిక చేశారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతుంది.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఒక భారీ సెట్‌లో జరుగుతోంది, ఇందులో అమితాభ్ ప్రముఖ పారిశ్రామికవేత్త అశ్వథ్థామగా కనిపిస్తుండగా, దీపికా పదుకొణె ఆయన ఎంప్లాయిగా నటిస్తోంది. ప్రభాస్ ఇందులో అమితాభ్ తనయుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.

First published:

Tags: Disha Patani, Nag Ashwin, Prabhas, Project K

ఉత్తమ కథలు