DISHA PATANI REJECTS HOLLYWOOD OFFER HERE ARE THE DETAILS SR
బంగారం లాంటి హలీవుడ్ ఆఫర్‌ను వదులుకున్న పూరి భామ..
దిశా పటానీ Photo : Twitter
Disha Patani : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన తెలుగు సినిమా 'లోఫర్'తో ఫిల్మ్ ఇండస్ట్రీ పరిచయమైంది ఈ అందాల ముద్దుగుమ్మ
Disha Patani : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన తెలుగు సినిమా 'లోఫర్'తో ఫిల్మ్ ఇండస్ట్రీ పరిచయమైంది ఈ అందాల ముద్దుగుమ్మ. ఆ తర్వాత హిందీ సినిమాలైన బాఘీ-2, ఎంఎస్ ధోనీ, కుంగ్ ఫూ యోగా, భారత్ వంటి చిత్రాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. నటనకంటే హాట్ ఫోటోషూట్స్, ఎక్స్‌పోజింగ్‌తో బోల్డ్ బ్యూటీగా అదరగొడుతోంది ఈ భామ. చేతినిండా సినిమాలు ఉన్నా కూడా తన ఉనికి చాటుకోవడం కోసం దిశాపటానీ అందాలను మాత్రమే నమ్ముకుంటుంది. అందులో భాగంగా తీరైన శరీర సౌష్టవంతో ఉన్న తన పిక్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... గ్లామర్ పోజులతో మతులు పోగొడుతోంది.
అది అలా ఉంటే ఈ అమ్మడు ఓ భారీ ఆఫర్ వదులుకుందని టాక్ వినిపిస్తోంది. అది చిన్నా చితక సినిమా ఆఫర్ కాదు.. ఏకంగా హాలీవుడ్ మూవీ ఆఫర్‌ను వదులుకుందట. తనకు హిందీ చిత్రసీమలోనే నటించాలనీ.. ఇక్కడే మంచి పేరు తెచ్చుకోవాలనీ ఉందట. అందుకే ఆ సినిమా ఆఫర్‌ను వదులుకుందట. ఇక దిశా సినిమాల విషయానికి వస్తే ఇటీవల బాగీ 3 సినిమాలో డూ యూ లవ్ అంటూ ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. ప్రస్తుతం దిశా పటానీ హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న 'రాధే' సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.