హోమ్ /వార్తలు /సినిమా /

డు యూ లవ్ మీ అంటున్న దిశా పటానీ .. బికినీలో హల్‌చల్ చేస్తూ..

డు యూ లవ్ మీ అంటున్న దిశా పటానీ .. బికినీలో హల్‌చల్ చేస్తూ..

దిశా పటాని

దిశా పటాని

టైగర్‌ ష్రాఫ్‌, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న సినిమా.. భాఘీ-3. అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియావాలా నిర్మించాడు. చిత్రంలో దిశా పటానీ ఐటమ్ సాంగ్‌ చేస్తోంది. డు యూ లవ్‌ మీ అంటూ సాగే వీడియో సాంగ్‌‌ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సాంగ్‌లో దిశా పటానీ బికినీలో కనువిందు చేసింది.

ఇంకా చదవండి ...

    టైగర్‌ ష్రాఫ్‌, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న సినిమా.. భాఘీ-3. అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియావాలా నిర్మించాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ కూడా మంచి టాక్ తెచ్చుకుంది. అన్నదమ్ముల అనుబంధానికి యాక్షన్ జోడించి ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ అన్నగా రితేశ్ దేశ్‌ముఖ్ నటించాడు. అయితే.. ఈ చిత్రంలో దిశా పటానీ ఐటమ్ సాంగ్‌ చేస్తోంది. డు యూ లవ్‌ మీ అంటూ సాగే వీడియో సాంగ్‌‌ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సాంగ్‌లో దిశా పటానీ బికినీలో కనువిందు చేసింది. తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ, సెగలు పుట్టించే హావభావాలు పలికిస్తూ కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే కోటి 16 లక్షల మంది చూసిన ఈ సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం రేపుతోంది. కాగా, అహ్మద్‌ ఖాన్‌ దర్శకత్వంలో భాఘీకి సీక్వెల్‌గా, భాగీ2 తర్వాత ఈ సినిమా తెరకెక్కుతోంది. మార్చి 6న భాగీ 3 ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Bollywood, Bollywood heroine, Bollywood Movie, Disha Patani