Disha Patani Mars Tour : చక్కటి ఫిగర్, అదిరే ఫిట్నెస్తో అభిమానుల్ని అలరిస్తూ ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ. ఈ ఫిట్నెస్ వల్లే... బాలీవుడ్లో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దిశ రెగ్యులర్‌గా వర్కవుట్స్ చేస్తుందని ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ని చూస్తే అర్థమైపోతుంది. అంతే కాదు... ఆమెకు ట్రావెలింగ్ హాబీ కూడా ఉంది. సాహసాలు ఎక్కువగా చేసే అలవాటున్న దిశ... అందుకోసం ఎంత దూరమైనా వెళ్తుంది. అంతెందుకు... ఇటీవల వచ్చిన ఆమె సినిమా మలంగ్‌లో... పటానీ... క్లిఫ్ డైవింగ్ లాంటి ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ చేస్తూ కనిపించే కేరక్టర్ చేసింది. అయితే సాహసాలు చేసేందుకు దిశ ఎక్కడి దాకా వెళ్లగలదు? ఈ భూమి అంచుల దాకా వెళ్లగలదా? ఇంకా ఎక్కువ దూరం వెళ్లగలదా? ట్విట్టర్లో "#AskDisha" పేరుతో ఓ హోస్టింగ్ సెషన్ నిర్వహించగా... ఓ అభిమాని ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం అందర్నీ ఆకట్టుకుంది.
Hi guys, thinking of doing #AskDisha . Looking forward to answering some fun questions. Let's do it at 11.00 AM?
— Disha Patani (@DishPatani) February 16, 2020
మీకు ఛాన్స్ ఇస్తే మార్స్‌కి వెళ్తారా అని అడిగాడు ఆ అభిమాని. ఆశ్చర్యకరంగా ఆమె ఎస్ అంది. ఇప్పటికైతే మనుషుల్ని మార్స్‌కి తీసుకెళ్లే ఛాన్స్ లేకపోయినా... త్వరలోనే ఈ కల సాకారం అయ్యే రోజులు రాబోతున్నాయి కాబట్టి... దిశ పటానీ కూడా మార్స్ (అంగారక) గ్రహంపైకి వెళ్లే ఛాన్సుంది.
Will you ever go to Mars for a vacation if offered. #AskDisha
— Krishna Vashu (@imkrishnavashu) February 16, 2020
Haha! Why not, I love adventure🥴 #AskDisha https://t.co/lX8Aluhffi
— Disha Patani (@DishPatani) February 16, 2020
దిశ పటానీ తన ఫిగర్‌ను పర్ఫెక్టుగా ఉంచుకునేందుకు ఫిట్నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. రోజుకు రెండుసార్లు వర్కవుట్స్ చేస్తుంది. ఉదయం వేళ డాన్సింగ్, కిక్ బాక్సింగ్, జిమ్నాస్టిక్స్ చేస్తుంది. సాయంత్రం వేళ వెయిట్స్ లిఫ్ట్ చేస్తుంది. ఇలా తన ఫిగర్‌ను కాపాడుకుంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Disha Patani, ISRO, Mars, NASA