అల్లు అర్జున్ బుట్ట బొమ్మ సాంగ్‌కు దిశా పటానీ ఫిదా.. ఈ స్టెప్ ఎలా వేసావంటూ..

Butta Bomma : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదలైన అల వైకుంఠపురములో ఓ రేంజ్‌లో విజయం సాధించింది. 

news18-telugu
Updated: March 31, 2020, 6:52 PM IST
అల్లు అర్జున్ బుట్ట బొమ్మ సాంగ్‌కు దిశా పటానీ ఫిదా.. ఈ స్టెప్ ఎలా వేసావంటూ..
అల్లు అర్జున్ బుట్ట బొమ్మ సాంగ్‌ను మెచ్చుకున్న దిశా పటానీ (Twitter/Photo)
  • Share this:
Butta Bomma : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదలైన అల వైకుంఠపురములో ఓ రేంజ్‌లో విజయం సాధించింది.  తెలుగులో బాహుబలి సినిమాల తర్వాత హైయేస్ట్ గ్రాసర్‌గా బన్నీ సినిమా నిలిచింది. పండుగ సందర్భంగా విడుదలైన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించగా.. మిగితా ప్రధాన పాత్రల్లో టబు, నివేదా పేతురాజ్, సుశాంత్, జయ రామ్, మురళీ శర్మ నటించారు. ఈ సినిమా మరో పెద్ద ఎస్సెట్ థమన్ సంగీతం. సినిమా విడుదల కాక మునుపే ఈ సినిమా పాటలు తెలుగు ప్రజల్నీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా కామెడీ సీన్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఆకట్టుకుంది. సినిమా కథ పాతదే అయిన ట్రీట్ మెంట్ సరిగా ఉండడంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేసారు. అల్లు అర్జున్‌తో పాటు మిగతా వాళ్లు  తమ నటనతో ఈ సినిమాను నిలబెట్టారు.  ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. అది అలా ఉంటే ఈ అల వైకుంఠపురంలో మేనియా హిందీ సినిమా ఇండస్ట్రీ సోకింది. ఈ సినిమాలో ఓ రేంజ్‌లో ఆకట్టుకున్న మాస్ సాంగ్ రాములో.. రాములా. ఈ సాంగ్ యూట్యూబ్‌లో సంచనాలు సృష్టించింది. ఆ సాంగ్‌లో బన్నీ వేసిన దోశ స్టెప్ ఎంత పాపులర్ తెలిసిందే.

ఆ సినిమాలో అలాంటి మరో హిట్ సాంగ్ బుట్ట బొమ్మ. ఈ సాంగ్ అటు టిక్ టాక్‌లో ఇటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ సందడి చేసింది. ఈ పాటకు స్టెప్ వేసి అలరించింది హిందీ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి. తాజాగా ఈ సినిమాలో బుట్టబొమ్మ పాటలో అల్లు అర్జున్ బల్లపై కిందకు జారుతూ ఉన్న వీడియోను షేర్ చేస్తూ ఈ డాన్స్‌ను మీరు ఎలా చేసారంటూ ప్రశ్నించింది. దానికి అల్లు అర్జున్ మంచి మ్యూజిక్ ఉంటే ఆటోమేటిక్‌గా అది నాతో డాన్స్ చేయిస్తోందంటూ చెప్పి దిశాకు ధన్యవాదాలు తెలిపాడు. మాకు స్పూర్తిగా ఉన్నందుకు థాంక్యూ అల్లు అర్జున్ అంటూ దిశా ప్రతిస్పందించింది. బుట్టబొమ్మ ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో ఇప్పటికే 91 మిలియన్ వ్యూస్  సాధించి త్వరలో 100 మిలియన్ వ్యూస్‌కు పరుగులు పెడుతోంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 31, 2020, 6:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading