Home /News /movies /

దిశా పటానీ డాన్స్‌కు షేక్ అవుతోన్న సోషల్ మీడియా..

దిశా పటానీ డాన్స్‌కు షేక్ అవుతోన్న సోషల్ మీడియా..

దిశా పటానీ Photo : Instagram

దిశా పటానీ Photo : Instagram

Disha Patani : తెలుగు సినిమా లోఫర్‌తో ఫిల్మ్ ఇండస్ట్రీ పరిచయమైన దిశా పటానీ.. ఆ తర్వాత హిందీ సినిమాలైన బాఘీ-2, ఎంఎస్ ధోనీ, కుంగ్ ఫూ యోగా, భారత్ వంటి చిత్రాలలో నటించి హీరోయిన్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

    Disha Patani : తెలుగు సినిమా లోఫర్‌తో ఫిల్మ్ ఇండస్ట్రీ పరిచయమైన దిశా పటానీ.. ఆ తర్వాత హిందీ సినిమాలైన బాఘీ-2, ఎంఎస్ ధోనీ, కుంగ్ ఫూ యోగా, భారత్ వంటి చిత్రాలలో నటించి హీరోయిన్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. నటనకంటే హాట్ ఫోటోషూట్స్, ఎక్స్‌పోజింగ్‌తో బోల్డ్ బ్యూటీగా అదరగొడుతోంది ఈ భామ. చేతినిండా సినిమాలు ఉన్నా కూడా త‌న ఉనికి చాటుకోవ‌డం కోసం దిశాప‌టానీ అందాల‌ను మాత్ర‌మే న‌మ్ముకుంటుంది. అందులో భాగంగా తీరైన శరీర సౌష్టవంతో ఉన్న తన పిక్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... గ్లామర్ పోజులతో మతులు పోగొడుతోంది. అది అలా ఉంటే కరోనా వల్ల ఏర్పడ్డ లాక్‌ డౌన్‌‌తో ప్రస్తుతం ఎటువంటీ షూటింగ్స్ లేక అందరూ ఇంటి పట్టునే ఉంటూ తోచిన పని చేసుకుంటూ ఆ వీడియోలను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు సినీ స్టార్స్. అందులో భాగంగా కొంత వంట పనులు చేస్తుంటే మరికొంత మంది స్టార్స్ తమ ఫిట్‌ నెస్ మీద దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగా `లోఫర్‌` బ్యూటీ దిశ పటానీ తాజాగా ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఓ పాప్ సాంగ్‌కు తన నడుము ఊపుతూ అదరగొట్టింది దిశా. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ వావ్ దిశా అంటూ పలు రకాల కామెంట్స్ పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

    ఇక దిశా సినిమాల విషయానికి వస్తే ఇటీవల బాగీ 3 సినిమాలో డూ యూ లవ్‌ అంటూ ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. దిశా పటానీ ప్రస్తుతం హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న రాధే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Disha Patani

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు