టెంపర్ రిపీట్..దిశా నిందితుల ఎన్‌కౌంటర్ పై నెటిజన్ల స్పందన..

news18-telugu
Updated: December 6, 2019, 11:03 AM IST
టెంపర్ రిపీట్..దిశా నిందితుల ఎన్‌కౌంటర్ పై నెటిజన్ల స్పందన..
‘టెంపర్’ మూవీలో ఎన్టీఆర్
  • Share this:
అవును తెలంగాణ పోలీసుల సాక్షిగా మరోసారి టెంపర్ సినిమా రీ క్రియేట్ అయిందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పోలీసులపై ప్రశంసలు ఝల్లు కురిపిస్తున్నారు. అచ్చం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’ సినిమాలో కూడా నలుగురు విలన్లు.. ఒక అమ్మాయిని ఎన్నో రోజులు చిత్ర హింసలకు గురిచేసి అత్యాచారం చేసి చంపేస్తారు. వాళ్లను హీరో ఎలా ఉరి కంబం ఎక్కించాడనేదే టెంపర్ స్టోరీ. నిర్భయ ఘటన తర్వాత తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా దిశా అత్యాచార కేసులో నిందితులను పోలీసులఈరోజు తెల్లవారుఝామున   ఎన్‌కౌంటర్ చేశారు. మొత్తంగా నలుగురు నిందితులను షాద్ నగర్ సమీపంలో చటాన్ పల్లి వద్ద దిశాను పాశవికంగా అత్యాచారం చేసి చంపిన చోటే నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసారు.

పోలీసులు వివరాల ప్రకారం.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును ఎన్‌కౌంటర్ చేసారు. పోలీసులు జరిపిన ఈ ఎన్‌కౌంటర్ పై టెంపర్ సీన్ రిపీట్ అయిందంటూ అక్కడ నలుగురు నిందితులు.. ఇక్కడ కూడా నలుగురు ఉండటం చూసి ఆ సినిమాతో పోలుస్తూ  సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు నిందితులకు తగిన శిక్ష విధించారంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా ఉన్న అత్యాచార నిందితలను ఇదే విధంగా ఎన్‌కౌంటర్ చేయాలని నినదిస్తున్నారు.


First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>