పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay devarakonda) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ (Liger). ఈ సినిమాలో విజయ్ దేవరకొండ జంటగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు పూరి. అటు హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, అనన్య పాండే సైతం ప్రమోషన్స్ పరంగా తమ మార్క్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ చూపించిన యాటిట్యూడ్ చర్చనీయాంశం అయింది.
ఈ సమావేశంలో విజయ్ దేవరకొండ ఎదురుగా ఉన్న టేబుల్ పై రెండు కాళ్ళు పెట్టి కూర్చున్నాడు. ఇలాగే విలేకర్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతాను అన్నాడు. దీంతో ఆయన తీరుపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా ఈ రేంజ్ యాటిట్యూడ్ చూపించిన దాఖలాలు లేవని, ఇది విజయ్ దేవరకొండ ఓవర్ యాక్షన్ అనే వాళ్ళు కొందరున్నారు. అయితే జర్నలిస్టులతో మాట్లాడుతున్న క్రమంలో సరదాగా ఉండటం విజయ్ హ్యబీ అని, అందుకే అప్పుడప్పుడూ ఇలాంటి యాటిట్యూడ్ చూపిస్తుంటాడని కొందరంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లైగర్ సినిమా విషయానికొస్తే.. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. షూటింగ్ చేస్తూనే ఈ సినిమా నుంచి వదులుతున్న ఒక్కో అప్ డేట్ సినిమాపై హైప్ పెంచేస్తోంది. విజయ్ దేవరకొండ- పూరి కాంబో కావడంతో ప్రతి ఒక్కరి చూపు ఈ సినిమాపైనే ఉంది.
Journo: టాక్సీవాలా టైమ్ లో మనం ఫ్రీగా మాట్లాడుకున్నాం.మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసాం కానీ ఇప్పుడు మీరు స్టార్ట్ అయ్యారు. అంత ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాం.@TheDeverakonda:అట్లా ఎం లేదు.మీరు అడగండి.కాలు మీద కాలు వేసుకొని అడగండి.నేను కూడా అట్లే కూర్చుంట.ఫ్రీ గా మాట్లాడుకుందాం.???????? #Liger pic.twitter.com/FXHScQOPQA
— Suresh Kondi (@SureshKondi_) August 15, 2022
పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మూవీని ఎంతో గ్రాండ్‌గా ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. లైగర్ (Liger) కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కావడం విశేషం. రీసెంట్‌గా విడుదల చేసిన విజయ్ దేవరకొండ సెమీ న్యూడ్ పోస్టర్ వైరల్‌గా మారడమే గాక జనాల్లో డిస్కషన్ పాయింట్ అయింది. దీంతో ఈ సినిమాలో యూత్ ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు పుష్కలంగా ఉంటాయని అంతా ఫిక్సయ్యారు. చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి UA సర్టిఫికెట్ జారీ అయింది. ఈ మూవీపై అన్ని వర్గాల ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.