మాస్ రాజా రవితేజా ఫ్యాన్స్... గెట్ రెడీ... దుమ్ము రేపేందుకు డిస్కో రాజా వచ్చేస్తోంది. వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో రవితేజా ఓ చేతిలో ఖరీదైన విదేశీ చుట్ట (సిగార్)... మరోచేతిలో గన్... మధ్యలో ల్యాండ్ ఫోన్‌తో పగలబడి నవ్వుతున్న పోస్టర్ చూస్తుంటే... డిసెంబర్లో మాస్ రాజా రచ్చ చెయ్యడం గ్యారెంటీ అన్నట్లు కనిపిస్తోంది. టైటిల్ కింద... రివైండ్... ఫార్వార్డ్... ప్లే... కిల్ అనే డైలాగ్స్ ఉన్నాయి. దీన్ని బట్టీ... జరిగిన దారుణాన్ని తిరిగి తెలుసుకొని... అందుకు కారణమైన వాళ్లను డిస్కో రాజా చంపేస్తాడా అన్న డౌట్ కలుగుతోంది. మొత్తంగా మరో హిట్... తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తున్నాయి. నిజానికి ఫలితంతో సంబంధం లేకుండా రవితేజ దూసుకుపోతున్నాడు. ఏజ్ పెరుగుతున్నా జోరు తగ్గట్లేదు. వరస సినిమాలతో సత్తా చూపిస్తున్నాడు. గతేడాది "టచ్ చేసి చూడు".. "నేల టికెట్టు".. "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమాలతో వచ్చాడు మాస్ రాజా. "రాజా ది గ్రేట్"తో రెండేళ్ల తర్వాత వచ్చి హిట్ కొట్టిన ఈ హీరో... ఆ తర్వాత రేసులో వెనకబడ్డాడు. రవితేజ సినిమాలు కనీసం 10 కోట్ల మార్క్ అందుకోలేక చేతులెత్తేస్తున్నాయి. ఇప్పుడు ‘డిస్కో రాజా’ డిసెంబర్ 20న విడుదల కానుంది.
Get ready for DISCO🕺🏻#DiscoRaja 🦋#DiscoRajaFirstLook@Dir_Vi_Anand @itsRamTalluri @SRTmovies pic.twitter.com/72g5OhW7cv
— Ravi Teja (@RaviTeja_offl) September 2, 2019
సైన్స్‌తో ఏదైనా సాధ్యమే.. గుడ్, బ్యాడ్, క్రేజీ అంటూ వచ్చిన మోషన్ పోస్టర్ ఇప్పటికే అదిరిపోయింది. ఇది చూస్తుంటే మళ్లీ ప్రయోగమే చేస్తున్నట్లు అర్థమైపోతుంది. "ఎక్కడికి పోతావు చిన్నవాడా"... "ఒక్కక్షణం" లాంటి భిన్నమైన సినిమాల తర్వాత విఐ ఆనంద్ చేస్తున్న సినిమా ఇది. ఇందులో ఈయన ముగ్గురు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయిస్తున్నాడు. "నేలటికెట్" నిర్మాత రామ్ తల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభా నటేష్... ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్... తాన్యా హోప్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తన కెరీర్లో ఇప్పటి వరకు చేయని ఓ కొత్త జోనర్లో ఈ చిత్రం ట్రై చేస్తున్నాడు రవితేజ. సైన్స్ ఫిక్షన్ కథగా ఇది వస్తుంది. ప్రయోగాత్మక కథను వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు విఐ ఆనంద్. మరోసారి థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కార్తిక్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Disco Raja, Ravi Teja, Telugu Movie, Tollywood news