డిస్కో రాజా ఫస్ట్ రివ్యూ.. రవితేజ రప్ఫాడించాడంట కదా..

దాదాపు ఏడాదిన్నర తర్వాత డిస్కో రాజా సినిమాతో వచ్చాడు రవితేజ. అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత ఈయన నుంచి సినిమాలు రాలేదు. ఫలితంతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు మాస్ రాజా. వ‌ర‌స సినిమాల‌తో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 24, 2020, 6:33 AM IST
డిస్కో రాజా ఫస్ట్ రివ్యూ.. రవితేజ రప్ఫాడించాడంట కదా..
‘డిస్కోరాజా’లో రవితేజ Instagram/raviteja_2628
  • Share this:
దాదాపు ఏడాదిన్నర తర్వాత డిస్కో రాజా సినిమాతో వచ్చాడు రవితేజ. అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత ఈయన నుంచి సినిమాలు రాలేదు. ఫలితంతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు మాస్ రాజా. వ‌ర‌స సినిమాల‌తో స‌త్తా చూపిస్తున్నాడు. 2019లో ఒక్క సినిమా కూడా చేయలేదు ఈయన. దానికి ముందు ఏడాది ట‌చ్ చేసి చూడు.. నేల‌ టికెట్టు.. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాల‌తో వ‌చ్చాడు మాస్ రాజా. రాజా ది గ్రేట్‌తో ఆ మధ్య హిట్ కొట్టిన ఈ హీరో.. ఆ త‌ర్వాత అదే టెంపో కొన‌సాగించ‌లేక‌పోయాడు. ఈయన సినిమాలు కనీసం 10 కోట్ల మార్క్ అందుకోలేక చేతులెత్తేస్తున్నాయి. ఇప్పుడు డిస్కో రాజా సినిమాతో వచ్చాడు మాస్ రాజా. ఈ చిత్ర ప్రీమియర్ షోకు మంచి టాక్ వచ్చింది. ఓవర్సీస్ ఆడియన్స్ రవితేజ సినిమాకు థమ్స్ అప్ ఇచ్చారు.
Disco Raja movie twitter review and Ravi Teja come up with an interesting science fiction drama pk దాదాపు ఏడాదిన్నర తర్వాత డిస్కో రాజా సినిమాతో వచ్చాడు రవితేజ. అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత ఈయన నుంచి సినిమాలు రాలేదు. ఫలితంతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు మాస్ రాజా. వ‌ర‌స సినిమాల‌తో.. ravi teja,ravi teja twitter,disco raja movie review,disco raja live updates,disco raja raview and live updates,disco raja censor,disco raja censor talk,disco raja movie censor review,disco raja release date,disco raja release date confirmed,Ravi teja vi anand movie,Ravi teja vi anand disco raja movie,Ravi teja vi anand disco raja movie review,telugu cinema,డిస్కో రాజా,రవితేజ డిస్కో రాజా,డిస్కో రాజా లైవ్ అప్‌డేట్స్,తెలుగు సినిమా,డిస్కో రాజా రివ్యూ
డిస్కో రాజా సెన్సార్ టాక్

సైన్స్‌తో ఏదైనా సాధ్యమే.. గుడ్, బ్యాడ్, క్రేజీ అంటూ వచ్చిన మోషన్ పోస్టర్ ఇప్పటికే అదిరిపోయింది. అదే సినిమాలో కూడా చూపించాడు దర్శకుడు. సైన్స్ ఫిక్షన్ డ్రామాను రవితేజ ఇమేజ్‌కు తగ్గట్లు రాసుకున్నాడని.. సినిమా చాలా బాగుందని టాక్ వినిపిస్తుంది. ఓవర్సీస్ నుంచి వస్తున్న టాక్ ప్రకారం చూస్తుంటే కచ్చితంగా మాస్ రాజా ముందు సినిమాలతో పోలిస్తే బెటర్ ఔట్‌పుట్‌తో వచ్చాడనేది వాస్తవం. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా.. ఒక్కక్ష‌ణం లాంటి భిన్న‌మైన సినిమాల తర్వాత విఐ ఆనంద్‌ చేసిన సినిమా ఇది. ఇందులో ఈయ‌న ముగ్గురు హీరోయిన్ల‌తో రొమాన్స్ చేసాడు. నేల‌టికెట్టు నిర్మాత రామ్ త‌ల్లూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. రవితేజ, బాబీ సింహా నటన సినిమాకు హైలైట్ అయిందని తెలుస్తుంది.
Disco Raja movie twitter review and Ravi Teja come up with an interesting science fiction drama pk దాదాపు ఏడాదిన్నర తర్వాత డిస్కో రాజా సినిమాతో వచ్చాడు రవితేజ. అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత ఈయన నుంచి సినిమాలు రాలేదు. ఫలితంతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు మాస్ రాజా. వ‌ర‌స సినిమాల‌తో.. ravi teja,ravi teja twitter,disco raja movie review,disco raja live updates,disco raja raview and live updates,disco raja censor,disco raja censor talk,disco raja movie censor review,disco raja release date,disco raja release date confirmed,Ravi teja vi anand movie,Ravi teja vi anand disco raja movie,Ravi teja vi anand disco raja movie review,telugu cinema,డిస్కో రాజా,రవితేజ డిస్కో రాజా,డిస్కో రాజా లైవ్ అప్‌డేట్స్,తెలుగు సినిమా,డిస్కో రాజా రివ్యూ
డిస్కో రాజా టైటిల్

ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ న‌భా న‌టేష్.. ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్.. తాన్యా హోప్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. ఇదిలా ఉంటే త‌న కెరీర్‌లో ఇప్పటి వ‌ర‌కు చేయ‌ని ఓ కొత్త జోన‌ర్‌లో ఈ చిత్రం ట్రై చేసాడు ర‌వితేజ‌. ముఖ్యంగా డిస్కో రాజా పాత్రలో రవితేజ నటన సినిమాకు హైలైట్. ఈ చిత్రంలో మాస్ రాజా డ్యూయల్ రోల్ చేసాడు. సునీల్ కామెడీ సినిమాకు బలం. రవితేజకు ఇదే తొలి సైన్స్ ఫిక్షన్ కథ. ప్రయోగాత్మక కథను వినోదాత్మకంగా తెరకెక్కించాడు విఐ ఆనంద్. థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫ‌ర్. మ‌రి చూడాలిక‌.. డిస్కో రాజాతో ఓవర్సీస్ ఆడియన్స్ మనసులు దోచుకున్న రవితేజ.. ఇండియాలో ఏం చేస్తాడో..?
Published by: Praveen Kumar Vadla
First published: January 24, 2020, 6:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading