హోమ్ /వార్తలు /సినిమా /

డిస్కోరాజా ఫ్లాప్ ఎఫెక్ట్‌తో ‘ఎఫ్ 3’ నుండి రవితేజ ఔట్.. మాస్ మహారాజ్ ప్లేస్‌లో..

డిస్కోరాజా ఫ్లాప్ ఎఫెక్ట్‌తో ‘ఎఫ్ 3’ నుండి రవితేజ ఔట్.. మాస్ మహారాజ్ ప్లేస్‌లో..

‘డిస్కోరాజా’లో రవితేజ (Disco Raja Collections)

‘డిస్కోరాజా’లో రవితేజ (Disco Raja Collections)

ఉరిమి వచ్చి మంగళం మీద పడ్డట్టు..తాజాగా రవితేజ హీరోగా నటించిన ‘డిస్కోరాజా’ ఫ్లాప్ ఎఫెక్ట్ నెక్ట్స్ సినిమా పై పడింది.

ఉరిమి వచ్చి మంగళం మీద పడ్డట్టు..తాజాగా రవితేజ హీరోగా నటించిన ‘డిస్కోరాజా’ ఫ్లాప్ ఎఫెక్ట్ నెక్ట్స్ సినిమా పై పడింది. ‘రాజా ది గ్రేట్ తర్వాత మాస్ మహారాజ్ చేసిన సినిమాలన్ని వరుస పెట్టి ఫ్లాప్ అవడంతో హీరోగా రవితేజ మార్కెట్ డౌన్ అవుతూ వచ్చింది. తాజాగా విడుదలైన ‘డిస్కోరాజా’ మీద బజ్ ఉన్నప్పటికీ కనీసం ఓపెనింగ్స్ దక్కించుకోలేదు. ప్రస్తుతం రవితేజ.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘ఎఫ్ 2’ మూవీకి సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ లో మూడో హీరోగా నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. దాదాపు రవితేజనే ఈ సినిమాలో మరో కథానాయకుడిగా అందరు అనుకున్నారు. కానీ ‘డిస్కోరాజా’ ఫ్లాప్ ఎఫెక్ట్‌తో ‘ఎఫ్ 3’ రవితేజ తీసుకోవద్దని దిల్ రాజు డిసైడ్ అయ్యాడట. ఆయన ప్లేస్‌లో మరో స్టార్ హీరోను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట దిల్ రాజు. ఐతే.. ఎవరినీ తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.

Raviteja Announced Three New Projects On The Eve Of His Birthday, Raviteja, Raviteja VI Anand Project, VI Anand, Raviteja VI Anand Disco Raja Movie, Raviteja Birthday Gift, Raviteja Santhosh srinivas, Raviteja santhosh Srinivas Theri Remake Project, Raviteja Anil Ravipudi F3 Sequel, రవితేజ, రవితేజ వీఐ ఆనంద్, రవితేజ వీఐ ఆనంద్ డిస్కోరాజా, రవితేజ సంతోష్ శ్రీనివాస్ తేరి రీమేక్, రవితేజ అనిల్ రావిపూడి ఎఫ్ 3 సీక్వెల్ పుట్టినరోజున రవితేజ త్రిపుల్ ధమాకా..
ఎఫ్2 సీక్వెల్‌గా రానున్న ఎఫ్3

తాజాగా దిల్ రాజు విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో అనిల్ సుంకరతో కలిసి సంయుక్తంగా తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. దీంతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’ మూవీకి సన్నాహాలు మొదలు పెట్టాడు.

First published:

Tags: Anil Ravipudi, Dil raju, Disco Raja, F2, Mahesh babu, Raviteja, Sarileru Neekevvaru, Varun Tej, Venkatesh

ఉత్తమ కథలు