డిస్కో రాజా కలెక్షన్స్.. రవితేజ జాతకం ఇంకా మారలేదుగా..

Disco Raja Collections: కాలెండర్ మారినా కూడా రవితేజ జాతకం మాత్రం మారలేదు. ఇప్పటికీ ఈయన సినిమాలు వస్తున్నాయి.. వెళ్తున్నాయి కానీ నిలబడటం లేదు. గతవారం విడుదలైన డిస్కో రాజా సినిమా కూడా మరోసారి రవితేజకు నిరాశనే మిగిల్చింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 1, 2020, 7:00 AM IST
డిస్కో రాజా కలెక్షన్స్.. రవితేజ జాతకం ఇంకా మారలేదుగా..
‘డిస్కోరాజా’లో రవితేజ (Disco Raja Collections)
  • Share this:
కాలెండర్ మారినా కూడా రవితేజ జాతకం మాత్రం మారలేదు. ఇప్పటికీ ఈయన సినిమాలు వస్తున్నాయి.. వెళ్తున్నాయి కానీ నిలబడటం లేదు. గతవారం విడుదలైన డిస్కో రాజా సినిమా కూడా మరోసారి రవితేజకు నిరాశనే మిగిల్చింది. ఈ చిత్రం కూడా దారుణంగా ఫ్లాప్ అయింది. కనీసం అంచనాలు అందుకోలేకపోయింది. విఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ముందు నుంచి అంచనాలు తక్కువగానే ఉన్నా.. ఆసక్తి మాత్రం బాగానే ఉంది. ఎందుకంటే సైన్స్ ఫిక్షన్ డ్రామా కావడంతో కచ్చితంగా ఆనంద్ ఏదో ఓ మాయ చేస్తాడనే నమ్మారు రవితేజ అభిమానులు. కానీ థియేటర్స్ తక్కువగా దొరకడం.. తొలిరోజే సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో ఎక్కడా నిలవడలేదు డిస్కో రాజా.
‘డిస్కోరాజా’లో రవితేజ (Disco Raja Collections)
‘డిస్కోరాజా’లో రవితేజ (Disco Raja Collections)


దాంతో పాటు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా సంచలన వసూళ్లు తీసుకొస్తుండటంతో మిగిలిన సినిమాలు కనీసం కనిపించడం లేదు. ఈ సినిమాను కొన్న బయ్యర్లు కూడా నిలువునా మునిగిపోయారు. డిస్కో రాజాతో మరోసారి రవితేజ తమను ముంచేసాడని ఫీల్ అవుతున్నారు డిస్ట్రిబ్యూటర్స్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 22 కోట్ల బిజినెస్ చేసింది. అయితే ఇప్పటి వరకు కనీసం 10 కోట్ల మార్క్ అందుకోలేకపోయింది డిస్కో రాజా. శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ కలుపుకొని నిర్మాత సేఫ్ అయ్యాడు కానీ ఈ సినిమాని కొన్న బయ్యర్లు మాత్రం 13 కోట్ల మేరకు నష్టపోయారని తెలుస్తుంది.
‘క్రాక్’లో రవితేజ (Disco Raja Collections)
‘క్రాక్’లో రవితేజ (Disco Raja Collections)

దాంతో మరోసారి రవితేజ భారీ నష్టాలు మిగిల్చింది. గతంలో నేల టిక్కెట్టు సినిమాను నిర్మించిన రామ్ తాళ్లూరి దీనికి నిర్మాత. మాస్ రాజా మార్కెట్ దారుణంగా పడిపోతున్న సమయంలో డిస్కో రాజా ఆయన ఇమేజ్‌ను మరింత దించేసింది. ఈ చిత్రంలో సునీల్ విలనిజం కూడా హెల్ప్ కాలేదు. ఇలాంటి సమయంలో క్రాక్ సినిమాతో హిట్ కొట్టకపోతే రవితేజ మార్కెట్ మరింత పడిపోవడం ఖాయం. మరి చూడాలిక.. ఏం జరుగుతుందో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: February 1, 2020, 7:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading