ఈ సారి క్రిస్మస్ తెలుగు ఇండస్ట్రీకి అస్సలు కలిసిరాలేదు. భారీ అంచనాలతో విడుదలైన రెండు సినిమాలు కూడా దారుణంగా బోల్తా కొట్టాయి. అటు ‘పడిపడి లేచె మనసు’.. ఇటు ‘అంతరిక్షం’ సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గరే కాదు విదేశాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ రెండు సినిమాలకు అక్కడ ఊహించిన వసూళ్లు అయితే రాలేదు.
ఈ సారి క్రిస్మస్ తెలుగు ఇండస్ట్రీకి అస్సలు కలిసిరాలేదు. భారీ అంచనాలతో విడుదలైన రెండు సినిమాలు కూడా దారుణంగా బోల్తా కొట్టాయి. అటు ‘పడిపడి లేచె మనసు’.. ఇటు ‘అంతరిక్షం’ సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గరే కాదు విదేశాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ రెండు సినిమాలకు అక్కడ ఊహించిన వసూళ్లు అయితే రాలేదు. శర్వానంద్ సినిమాలకు అక్కడ మంచి మార్కెట్ ఉంది.. పైగా ప్రేమకథ అయినా కూడా ‘పడిపడి లేచె మనసు’ను కనీసం పట్టించుకోలేదు ఓవర్సీస్ ఆడియన్స్.
పడిపడి లేచె మనసు, అంతరిక్షం సినిమాలు
ఇప్పటి వరకు ఈ చిత్రం కేవలం 2 లక్షల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ఇక మరోవపు ‘అంతరిక్షం’ కూడా అంతే పరిస్థితి. ఈ చిత్రం 2 లక్షల 82 వేల డాలర్లు మాత్రమే ఇప్పటి వరకు వసూలు చేసింది. ఈ రెండు సినిమాలు చేతులెత్తేయడంతో మధ్యలో వచ్చిన కన్నడ సినిమా ‘కేజియఫ్’ కుమ్మేస్తుంది. అక్కడ ఇప్పటికే ఈ చిత్రం 3 లక్షల డాలర్లు వసూలు చేసి హాఫ్ మిలియన్ వైపు పరుగులు తీస్తుంది. మన ఇండస్ట్రీకి మిలియన్ అంటే చిన్న విషయం కానీ కన్నడ సినిమాలకు మాత్రం అదో పెద్ద రికార్డే. ఇప్పుడు ఈ రికార్డుకు చేరువగా వెళ్లేలా కనిపిస్తుంది కేజియఫ్.
కేజియఫ్ సినిమా పోస్టర్
ధనుష్ హీరోగా వచ్చిన ‘మారి 2’ పరిస్థితి మరింత దారుణం. ఈ చిత్రం అక్కడ ఇప్పటి వరకు కేవలం 40 వేల డాలర్లు మాత్రమే వసూలు చేసి డిజాస్టర్ ఆఫ్ ది వీక్ అయిపోయింది. సాయిపల్లవి, ధనుష్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని బాలాజీ శంకర్ తెరకెక్కించాడు. మొత్తానికి ఈ వారం ఇండియాతో పాటు ఓవర్సీస్ కింగ్‌గా నిలిచాడు యశ్. ‘కేజియఫ్’ సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ వైడ్ టాపిక్ అయిపోయాడు ఈ కుర్ర హీరో.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.