దర్శకుడు వినాయక్ సినిమాకు అనుకోని కష్టాలు..

వివి వినాయక్..దర్శకుడుగా అందరికీ ఈయన పరిచయమే. తెలుగులో సీనియర్ హీరోలతో సినిమాలు తీసి సూపర్ హిట్స్ కొట్టాడు. ఇప్పుడు ఈయన హీరోగా మారాడు. తాజాగా ఈ సినిమా విషయంలో వినాయక్‌కు అనుకోని కష్టాలు మొదలయ్యాయి.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 14, 2020, 1:21 PM IST
దర్శకుడు వినాయక్ సినిమాకు అనుకోని కష్టాలు..
వి.వి.వినాయక్ (Twitter/Photo)
  • Share this:
వివి వినాయక్..దర్శకుడుగా అందరికీ ఈయన పరిచయమే. తెలుగులో సీనియర్ హీరోలతో సినిమాలు తీసి సూపర్ హిట్స్ కొట్టాడు. ఇప్పుడు ఈయన హీరోగా మారాడు. దానికోసమే కొన్ని రోజులుగా దర్శకత్వానికి దూరంగా ఉంటూ బాడీ బిల్డప్ చేసాడు. హీరో లుక్ కోసం తనను తాను చాలా మార్చుకున్నాడు వినాయక్. మన ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు హీరోలుగా మారారు. ఇప్పుడు వివి వినాయక్ కూడా ఇదే చేసాడు. ఈయన సినిమాకు ‘సీనయ్య’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. నరసింహా అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. తాజాగా దర్శకుడు వినాయక్.. ఈ సినిమాను పక్కనపెట్టేసినట్టు సమాచారం. కొన్ని రోజులు షూటంగ్ చేశాక.. రషెస్ చేసుకుని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసాడట దర్శకుడు వినాయక్. పైగా ఈ సినిమా కథ కూడా అప్పట్లో వచ్చిన ఒక సూపర్ హిట్ కథకు పోలిక కూడా ఉంటడం వంటివి ఉండటంతో నిర్మాత దిల్ రాజును కలిసి సినిమా ఆపేద్దామని వినాయక్ రిక్వెస్ట్ చేశాడట. ఈ సినిమా తీయడం అంటే డబ్బులు వృథా చేయడం తప్ప ప్రయోజనం ఏమి ఉండదని సినిమా చేయద్దని చెప్పేశాడట. మొత్తానికి హీరోగా వినాయక్ ఏ ముహూర్తానా ఈ సినిమా షార్ట్ చేసాడో అసలు కలిసి రావడం లేదని అందరు చెప్పుకుంటున్నారు.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు