నందమూరి బాలకృష్ణ చేసిన పనికి చేయెత్తి మొక్కాల్సిందే అంటున్నారు దర్శకుడు వివి వినాయక్. తాజాగా కరోనా నేపథ్యంలో సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు అందరు బాధ పడుతున్నారు. కోవిడ్ 19 నేపథ్యంలో సినిమా షూటింగ్స్ జరగడం లేదు. ప్రభుత్వాలు షూటింగ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినా.. హీరోలు మాత్రం కాలు బయటపెట్టడానికి మాత్రం వెనకాడుతున్నారు. షూటింగ్ అంటే కేవలం హీరోలు మాత్రమే కాదు.. హీరోయిన్స్, టెక్నీషియన్స్, కెమెరామెన్లతో పాటు లైట్ బాయ్‌లు చాలా మందితో షూటింగ్స్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం షూటింగ్ చేసినా.. అందులో ఏ ఒక్కరికైనా కరోనా పాజిటివ్ లక్షణాలు ఉంటే మిగతా వారికి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న అమితాబ్ బచ్చన్ వంటి ఆల్ ఇండియా సూపర్ స్టార్కే కరోనా పాజిటిల్ వచ్చింది.దీంతో మిగతా హీరోలు.. షూటింగ్ అంటేనే భయపడుతున్నారు. కరోనాకు వాక్సిన్ వచ్చే వరకు షూటింగ్స్‌కు చేయలేమని ఇప్పటికే చాలా మంది పెద్ద హీరోలు చేతులెత్తేసారు. ఒకవేళ సినిమాలు పూర్తి చేసినా.. ప్రజలు థియేటర్స్‌కు వచ్చి సినిమాలు చూసే అవకాశాలు ఏ మేరకు ఉంటాయనేది ఇపుడే చెప్పలేము.
తాజాగా నందమూరి బాలకృష్ణ కరోనా విజృంభిస్తోన్న ఈ వేళ సినిమా ఇండస్ట్రీలోని 24 విభాగాలకు చెందిన అందిరికీ బసవతారకం కాన్సర్ ఆసుపత్రి తరుపున కరోనా నిరోధానికి సంబంధించిన హోమియో పిల్స్ విటమిన్ టాబ్లెట్స్‌తో పాటు కరోనా రాకుండా నిరోధించేందకు పలు మందులను అందజేసి గొప్ప మనుసు చాటుకున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ తెలిపారు.
ముందు జాగ్రత్తగా కరోనా నిరోధానికి హోమియో పిల్స్, విటమిన్ టాబ్లెట్స్ ను బసవతారకం హాస్పిటల్ ద్వారా నందమూరి బాలకృష్ణ గారు పంపారు.నాకే కాదు ఈ మెడిసిన్ ను ఆయన 24 క్రాఫ్ట్స్ కు చెందిన అందరికీ పంపిస్తున్నారు.నన్ను గుర్తుపెట్టుకుని మరీ పంపినందుకు బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు
-వి వి వినాయక్ pic.twitter.com/VQWLs3cdQE
— BARaju (@baraju_SuperHit) July 25, 2020
ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ.. ముందు జాగ్రత్తగా కరోనా నిరోధానికి హోమియో పిల్స్, విటమిన్ టాబ్లెట్స్‌ను నాకు బసవతారకం కాన్సర్ హాస్పిటల్ తరుపున నందమూరి బాలకృష్ణకి పంపించారు. నాకే కాదు ఈ మందులు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని విభాగాల వాళ్లకు పంపిస్తున్నారు. నన్ను పర్సనల్‌గా గుర్తు పెట్టుకొని మరీ మందులు పంపించినా బాలకృష్ణగారికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. రీసెంట్గా పొద్దుటూర్‌లో బాలయ్య అభిమాని ఒకరు చనిపోతే.. వాళ్లు అమ్మగారికి ఫోన్ చేసి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు బాలయ్య. అంతేకాదు వాళ్లు కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. వినాయక్, బాలయ్య వీళ్లిద్దరి కాంబినేషన్లో గతంలో ‘చెన్నకేశవ రెడ్డి’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. త్వరలో వీళ్లిద్దరి కాంబనేషన్లో మరో సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Cancer, Corona virus, Covid-19, NBK, VV Vinayak