DIRECTOR VIKRAM KUMAR PLANNING TO AMKE MANAM2 WITH AKKINENI FAMILY AGAIN MHN
Akkineni family - Manam Movie: అక్కినేని ఫ్యామిలీ కోసం ‘మనం 2’ సిద్ధమవుతోందా..?
Director Vikram Kumar Planning to amke Manam2 with Akkineni family again
Akkineni family - Manam Movie: తెలుగు సినిమాల్లో క్లాసిక్ మూవీగా నిలిచిన మనం తర్వాత మనం 2ను రూపొందించడానికి దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మూడు తరాల నటులు కలిసి చిత్రాల్లో ‘మనం’ రెండో సినిమాగా ఓ హిస్టరీని క్రియేట్ చేసింది. కపూర్ ఫ్యామిలీ తర్వాత అక్కినేని ఫ్యామిలీకే ఆ రికార్డ్ దక్కింది. మనం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, చైతన్య, అఖిల్ కలిసి నటించారు. ఓ రకంగా చెప్పాలంటే అక్కినేని ఫ్యామిలీలో ఇప్పుడు భాగమైన సమంత కూడా పెళ్లి కాకముందే నటించడం విశేషం. ఈ సినిమా తెలుగు సినిమాల్లో ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయిందనాలి. అంతే కాదు.. అక్కినేని నాగేశ్వరరావు నటించిన అఖరి చిత్రం కూడా ఇదే మరి. అందుకనే నాగార్జున అండ్ ఫ్యామిలీ సభ్యులకు మనం సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కె.కుమార్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది.
అఖిల్‌తో ‘హలో’ సినిమాను నాగార్జున భారీగానే ఖర్చు పెట్టించి రూపొందించాడు. ఇప్పుడేమో నాగచైతన్య డిఫరెంట్ క్యారెక్టర్‌తో ‘థాంక్యూ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చేస్తున్న సమయంలో విక్రమ్ కుమార్‌కు ‘మనం’ వంటి ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఐడియా వచ్చింది. ఆ ఐడియాను నాగార్జునకు చెబితే ఆయన స్క్రిప్ట్ సిద్ధం చేసుకు రమ్మని చెప్పాడట. ఇప్పుడు విక్రమ్ కుమార్ ‘మనం 2’ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ నచ్చితే నాగార్జునతో పాటు అక్కినేని ఫ్యామిలీ సభ్యులైన అమల, సుశాంత్, సుమంత్ తదితరులు కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం విక్రమ్ కుమార్ తన దర్శకత్వంలో మరోసారి నాగచైతన్యను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథను అందించారు. దిల్‌రాజు నిర్మాణంలో సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది.