‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్‌కు గల కారణాలు ఇవే అంటున్న త్రివిక్రమ్..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘అజ్ఞాతవాసి’ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ అట్టర్ ఫ్లాపైంది. ఆ ప్లాప్‌గల కారణాలు ఇవే అంటున్నారు త్రివిక్రమ్ సన్నిహితులు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 30, 2020, 7:05 AM IST
‘అజ్ఞాతవాసి’  ఫ్లాప్‌కు గల కారణాలు ఇవే అంటున్న త్రివిక్రమ్..
పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ (Pawan Kalyan Trivikram)
  • Share this:
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘అజ్ఞాతవాసి’ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ అట్టర్ ఫ్లాపైంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో చేసిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. తాజాగా అల్లు అర్జున్‌తో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఆ సక్సెస్ ట్రాక్ కొనసాగించాడు. ఏ దర్శకుడి కెరీర్‌లోనైనా హిట్స్ ఫ్లాప్స్ కామన్. కానీ మాటల మాంత్రికుడు ఒకే ఒక్క సినిమా ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్‌తో అలర్ట్ అయ్యాడు. ఆ తర్వాత వెంట వెంటనే సూపర్ హిట్స్ స్వంతం చేసుకున్నాడు. దీనికో పెద్ద రీజనే ఉందని చెబుతున్నారు మాటల మాంత్రికుడి సన్నిహితులు. త్రివిక్రమ్ వరుస హిట్స్‌తో బ్యాక్ బౌన్స్ అవ్వడానికి కారణం వాస్తు అంటున్నారు. నిజమే మీరు విన్నది కరెక్టే. వాస్తు కరెక్ట్‌గా లేకపోవడం వల్లే ‘అజ్ఞాతవాసి’ సినిమాలో వాసి లోపించదట. అప్పట్లో త్రివిక్రమ్ ఉంటోన్నఇల్లు, వాస్తు శాస్త్ర నియమాలకు విరుద్ధంగా కొంత భాగం నిర్మించారట. ఆ దెబ్బకు ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్ అయిందని త్రివిక్రమ్ తన సన్నిహితులకు చెప్పాడట.pawan kalyan not interested to act bollywood super hit pink telugu remake here are the details,pawan kalyan u turn,pawan kalyan not interested to act pink remake,pawan kalyan new movie starts,pawan kalyan as lawyer,pawan kalyan lawyer saab,lawyer saab,pawan kalyan december shooting starts,pawan kalyan,pooja hegde pawan kalyan pooja hegde,pawan kalyan nayanthara,nayanthara,boney kapoor,pawan kalyan boney kapoor,pawan kalyan serious about boney kapoor dil raju,pink remake,pawan kalyan new movie,pawan kalyan latest news,pawan kalyan pink remake,pawan kalyan speech,power star pawan kalyan,jhanvi kapoor,pawan kalyan next movie,pawan kalyan movies,pawan kalyan live,pawan kalyan fans,sridevi and boney kapoor,pawan kalyan re entry,pawan kalyan re entry in movies,pawan kalyan long march,pawan kalyan songs,pawan kalyan pink,pawan kalyan craze,pawan kalyan twitter,pawan kalyan instagram,boney kapoor twitter,boney kapoor instagram,పవన్ కళ్యాణ్,దిల్ రాజు,బోనీ కపూర్,దిల్ రాజు బోనీ కపూర్,బోనీ కపూర్ పై పవన్ కళ్యాణ్ సీరియస్,బోనీ కపూర్ పింక్ రీమేక్ పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ పూజా హెగ్డే,పవన్ కళ్యాణ్ నయనతార,లాయర్‌గా కోర్టు మెట్లు ఎక్కనున్న పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ యూ టర్న్,పవన్ కళ్యాణ్ లాయర్ సాబ్
పవన్ కళ్యాణ్(ఫేస్‌బుక్ ఫోటో)

కానీ ఆ తర్వాత ఎన్టీఆర్‌తో చేసిన ‘అరవింద సమేత వీర రాఘవ’ మళ్లీ విజయం అందుకున్నారు త్రివిక్రమ్. దీనికి కారణం ఇంట్లో వాస్తు  సరిగా లేని భాగాన్ని వాస్తు దోషం లేకుండా పునర్నిర్మించి వాస్తు దోషం పోయేలా రీ కన్‌స్ట్రక్షేన్ చేయించడట. వాస్తుని, జ్యోతిష్యాన్ని, న్యూమరాలిజీని నమ్మేవారు ఇండస్ట్రీ వ్యక్తులే కాదు.. కామన్ పీపుల్ చాలా మందే ఉన్నారు. అలా త్రివిక్రమ్ కూడా వాస్తును నమ్ముకోవడం వల్లే మళ్లీ వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు వాస్తు విషయంలో త్రివిక్రమ్‌ను అడిగి సలహాలు సూచనలు అడుగుతున్నారట. మొత్తానికి ‘అల వైకుంఠపురములో’ సంచలన విజయంతో మాటల మాంత్రికునికి డబుల్ క్రేజ్ వచ్చిందనే చెప్పాలి. అంతేకాదు ఇపుడు వాస్తు పండితుడిగా తన దగ్గరికి వచ్చే వాళ్లకు వాస్తులో సలహాలు సూచనలు కూడా ఇస్తూ మంచి పేరు సంపాదించుకుంటున్నాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 30, 2020, 7:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading