హోమ్ /వార్తలు /సినిమా /

Vijay Deverakonda: అందరం కలిసి చచ్చిపోదాం ఏముందిలే! రియల్ యాక్సిడెంట్ స్టోరీ రివీల్ చేసిన డైరెక్టర్

Vijay Deverakonda: అందరం కలిసి చచ్చిపోదాం ఏముందిలే! రియల్ యాక్సిడెంట్ స్టోరీ రివీల్ చేసిన డైరెక్టర్

Photo twitter

Photo twitter

మొన్నటిదాకా విజయ్ దేవరకొండ యాక్సిడెంట్ సంగతులు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే అది నిజం కాదని ఖుషి చిత్రయూనిట్ తేల్చేసింది. కానీ విజయ్ దేవకొండకు నిజంగానే ఓ యాక్సిడెంట్ అయిందని, ఆ సమయంలో వాహనంలో ఉన్న ఆయన ఫీలింగ్స్ ఆశ్చర్యపర్చాయని అంటున్నారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్.

ఇంకా చదవండి ...

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సినిమా కెరీర్‌ని మలుపుతిప్పిన సినిమా పెళ్లి చూపులు (Pelli Chupulu). అతి తక్కువ బడ్జెట్‌తో తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు విజయ్. ఆ తర్వాత అర్జున్ రెడ్డి (Arjun Reddy), గీత గోవిందం (Geetha Govindam) లాంటి సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకొని ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ సమంత (Samantha) జోడీగా 'ఖుషి' (Kushi) అనే సినిమా చేస్తున్నారు. కాశ్మీర్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం (Accident) జరిగిందని విన్నాం. ఈ ప్రమాదంలో విజయ్, సామ్ గాయపడ్డారని అన్నారు కానీ అది నిజం కాదని చిత్రయూనిట్ తేల్చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఆలీతో సరదాగా (Alitho Saradaga) ప్రోగ్రాం ప్లోమోలో విజయ్ దేవరకొండ నిజమైన యాక్సిడెంట్ స్టోరీ రివీల్ చేస్తూ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్.

తన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన 'పెళ్లి చూపులు' సినిమా షూటింగ్ సమయంలో నిజంగానే ఓ యాక్సిడెంట్ జరిగిందని తెలుపుతూ ఆ సమయంలో చోటుచేసుకున్న సంఘటనను వివరించారు తరుణ్ భాస్కర్. సినిమా షూటింగ్‌లో భాగంగా విజయ్‌తో కలిసి ట్రక్‌లో వెళుతుండగా బ్రేక్ ఫెయిల్ అయింది. అప్పటిదాకా భయపడుతున్న విజయ్ ఆ బ్రేక్ ఫెయిల్ కాగానే కొంచెం రిలాక్స్ అయ్యాడు. ఆ తర్వాత దర్శి హ్యాండ్ బ్రేక్ లాగగానే అది కూడా వర్క్ చేయలేదు. ఆఖరికి ఓ చెట్టు దగ్గర ఆగింది. అయితే అసలు ఈ యాక్సిడెంట్‌లో నేను బ్రతికా అన్నదానికంటే విజయ్ ఫీలింగ్స్ ఏంటి అనే క్యూరియాసిటీ నాలో ఉండిపోయింది.

వెంటనే వెళ్లి విజయ్‌ని అడిగా ఎందుకంత రిలాక్స్ ఉన్నవని? దానికి విజయ్ రియాక్ట్ అవుతూ.. మొదట భయమేసింది కానీ ఆ తర్వాత అందరం కలిసి చచ్చిపోదాం కదా ఏముందిలే అనిపించిందని అన్నాడు. దీంతో చాలా ఆశ్చర్యపోయా అని తరుణ్ భాస్కర్ అన్నారు. ఇకపోతే విజయ్​ దేవరకొండతో మళ్లీ సినిమా చేస్తారా? అని ఆలీ వేసిన ప్రశ్నకు బదులిస్తూ.. విజయ్ దేవరకొండ తనకు వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ చమత్కరించాడు తరుణ్. తనకు వరుసగా మూడు ఫ్లాప్స్ వస్తే అప్పుడు విజయ్​ దేవరకొండను వైల్డ్​ కార్డ్​లా వాడేస్తా అంటూ ఓపెన్‌గా చెప్పేశారు. ఇంకా ఈ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి ముచ్చట్లు, చదువుకునే రోజులు, కెరీర్ సంగతులను సరదాగా పంచుకున్నారు తరుణ్ భాస్కర్. మే 30న టీవీలో ప్రసారం కాబోయే ఆలీతో సరదాగా ఫుల్ ఎపిసోడ్‌లో ఎంచక్కా ఈ సరదా ముచ్చట్లన్నీ చూడొచ్చు.

First published:

Tags: Ali, Alitho Saradaga, Tarun bhaskar, Vijay Devarakonda, విజయ్ దేవరకొండ

ఉత్తమ కథలు