మెగాస్టార్ చిరంజీవిపై దర్శకుడు తేజ సంచలన వ్యాఖ్యలు చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా తేజ.. ఒక ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా ఆయన చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. చిరంజీవి సామాన్య స్ధాయి నుంచి మెగాస్టార్‌గా ఎదగడం వెనక ఉన్న కృషిని వివరించాడు. అంతేకాకుండా చిరంజీవి సినిమా రంగంలో ప్రతి విషయం పట్ల చూపే శ్రద్ధ వల్లే ఆయన మెగాస్టార్ స్థాయికి ఎదిగాడని ఊరకే ఈ స్థాయికి రాలేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. చిరంజీవి లాగనే నటీనటులకు సినిమాకు సంబంధించిన ప్రతి విషయం పట్ల ఆసక్తి ఉండాలి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒక సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను.
ఆ సినిమాలోని ఒక సన్నివేశంలో ఆయన పరిగెత్తాలి. ఆ సీన్‌లో ఆయన పరిగెత్తాలి. ఆ సీన్ కోసం మేము సెట్‌లో 20 రిఫ్లెక్టర్‌లను ఏర్పాటు చేశాం. ఆ షాట్ పూర్తైన తర్వాత డైరెక్టర్ కట్ చెప్పి సీన్ ఓకే చేవారు. కానీ చిరంజీవి మాత్రం ఆ సీన్‌ను మళ్లీ రీ షూట్ చేద్దాం అన్నారు. ఎందుకంటే ఆ రిఫ్లెక్టర్లలో ఒకటి పనిచేయడం లేదని చెప్పారు. అపుడు వెంటనే దర్శకుడు ఈ సన్నివేశాన్ని మళ్లీ రీ షూట్ చేశారు. ఒక నటుడిగా ఆయన సినిమా పట్ల ఎంత అంకిత భావంతో ఉంటారో ఈ విషయం తెలియజేస్తోంది. అందుకే ఆయన మెగాస్టార్ రేంజ్‌కు చేరుకున్నారన్నారు. మరోవైపు తెల్లగా ఉన్నవాళ్లు మహేష్ బాబు కాలేరు. నల్లగా ఉన్న వాళ్లు రజినీకాంత్ కాలేరని ఈ సందర్భంగా మాట్లాడారు. తేజ విషయానికొస్తే.. నేనే రాజు నేను మంత్రి వంటి సూపర్ హిట్ తర్వాత ఆయన దర్శకత్వంలో ‘సీత’ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Sye raa narasimhareddy, Teja, Telugu Cinema, Tollywood