రాహుల్ గాంధీ ఎంత మేధావో తెలియదా.. తేజ సంచలనం..

దర్శకుడు తేజ (teja director)

Teja Rahul Gandhi: ఉన్నదున్నట్లు ముక్కుసూటిగా మాట్లాడటం దర్శకుడు తేజకు అలవాటు. అదే ఆయన్ని కొన్నిసార్లు ఇబ్బందుల్లో కూడా పడేలా చేస్తుంది. అయినా కూడా ఆయన తన పంథా మాత్రం మార్చుకోడు.

  • Share this:
ఉన్నదున్నట్లు ముక్కుసూటిగా మాట్లాడటం దర్శకుడు తేజకు అలవాటు. అదే ఆయన్ని కొన్నిసార్లు ఇబ్బందుల్లో కూడా పడేలా చేస్తుంది. అయినా కూడా ఆయన తన పంథా మాత్రం మార్చుకోడు. అప్పట్లో బాహుబలి సహా తెలుగు హీరోలపై, సినిమాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇప్పుడు మరోసారి ఈయన సంచలన వ్యాఖ్యలు చేసాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజ చాలా విషయాలపై మనసు విప్పి మాట్లాడేసాడు. అందులో ఆస్తులు, వారసుల గురించి కూడా ఉంది. మీరు ఎంత సంపాదించారు.. మీ పిల్లలకు ఏమిస్తారనే టాపిక్ యాంకర్ తీసుకొచ్చినపుడు చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు ఈ దర్శకుడు.

దర్శకుడు తేజ (teja director)
దర్శకుడు తేజ (teja director)


పిల్లలకు ఆస్తులు దాచిపెట్టి ఇచ్చేవాడు ఓ వేస్ట్ ఫెల్లో.. వాడు తన కొడుకులు ఎందుకూ పనికిరాడని ముందే డిసైడ్ అయిపోయి.. వాళ్లను సన్నాసులుగా మార్చడానికే ఆస్తులు ఇస్తారని చెప్పాడు తేజ. ఎవడైనా తన కొడుకు తెలివైన వాడు కావాలి.. ప్రయోజకుడు కావాలని కోరుకంటాడు కానీ ఆస్తులు ఇచ్చి సోమరిపోతుతో సహా ఎందుకు పనికిరాని వాడిలా చేయాలనుకోడని చెప్పాడు. అందుకే తన వారసులకు ఎప్పుడూ ఆస్తులు ఇవ్వాలనుకోలేదని.. వాళ్లను తెలివైన వాళ్లుగా మాత్రమే మార్చాలనుకున్నట్లు చెప్పాడు తేజ.

దర్శకుడు తేజ (director Teja)
దర్శకుడు తేజ (director Teja)


వేల కోట్ల ఆస్తులు ఇస్తే రాబోయే తరాలను నాశనం చేసినట్లే అని.. వాడికి ఎలా సంపాదించాలో తెలియక తండ్రులు తాతలు సంపాదించిన ఆస్తిని తింటాడని.. ఆ తర్వాత తరం వాడు మరింత పనికి రాకుండా.. సుద్ద మొద్దులా మారిపోతాడని చెప్పాడు తేజ. ఐదు తరాలు నిలబడిన ఆస్తిపరులు ఎవరైనా ఉన్నారా చూపించండి అంటూ తేజ సవాల్ చేసాడు. ఒకప్పటి కోటీశ్వరుల వారసులు ఇప్పుడు చాలా మంది రోడ్లపైకి వచ్చేసారని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇక వాడికి ఎలా బతకాలో తెలివి కూడా ఉండదని చెప్పాడు.

ఇప్పుడు నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఉన్నారు.. వాళ్ల మేధస్సు ఏంటి.. ఇప్పుడున్న రాహుల్ గాంధీ ఎంత మేధావి అనేది అందరికీ తెలుసు అంటూ కామెంట్ చేసాడు తేజ. చాలా మంది మేధావుల మనవళ్లు ఇడియట్స్‌లా ఉంటారు.. ఎందుకంటే వాళ్లకేం తెలియదు కాబట్టి అంటూ కామెంట్ చేసాడు తేజ. (వీడియో 5 నిమిషాల 29 సెకన్ల టైమ్‌లో కామెంట్ ఉంటుంది..)వారసులకు ఆస్తులు ఇస్తే కచ్చితంగా వాళ్లను నాశనం చేసినట్లే అంటూ కుండ బద్ధలు కొట్టేసాడు తేజ. ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published: