ఆ సినిమా నేను డైరెక్ట్ చేసి ఉంటేనా... బాలయ్య సినిమాపై దర్శకుడు తేజ సంచలన వ్యాఖ్యలు...

‘సీత’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ‘ఎన్.టీ.ఆర్’ బయోపిక్ గురించి, బాలయ్య గురించి మాట్లాడిన దర్శకుడు తేజ... ‘ఎన్.టీ.ఆర్’ బయోపిక్ సినిమాలు చూడలేదని చెప్పిన తేజ... తాను ఆ సినిమాను చేసి ఉంటే మరింత అధ్వాన్నంగా వచ్చి ఉండేదమోనంటూ కామెంట్... తేజ కామెంట్స్‌తో బాగా హర్ట్ అయిన బాలయ్య ఫ్యాన్స్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 16, 2019, 1:37 PM IST
ఆ సినిమా నేను డైరెక్ట్ చేసి ఉంటేనా... బాలయ్య సినిమాపై దర్శకుడు తేజ సంచలన వ్యాఖ్యలు...
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు తేజ
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 16, 2019, 1:37 PM IST
నందమూరి బాలకృష్ణ ఇప్పటికే వందకు పైగా సినిమాలు చేసినా... ఎంతో ఇష్టంగా, ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన సినిమా, తన తండ్రి స్వీర్గీయ నందమూరి తారక రాముడి జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘ఎన్.టీ.ఆర్’ బయోపిక్. ఎన్నో అంచనాలతో భారీ బడ్జెట్‌తో ‘ఎన్.టీ.ఆర్- కథానాయకుడు’, ‘ఎన్.టీ.ఆర్- మహానాయకుడు’ అంటూ రెండు భాగాలుగా తెరకెక్కిన తారకరాముడి బయోపిక్ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. బాలయ్య సినిమాలకు వచ్చే కనీస వసూళ్లు కూడా సాధించలేకపోయాయి ఈ రెండు భాగాలు. నిజానికి ‘ఎన్.టీ.ఆర్’ బయోపిక్ తీయాలనే ఆలోచన రాగానే ఈ మెగా ప్రాజెక్ట్ తెరకెక్కించే బాధ్యతను డైరెక్టర్ తేజకు అప్పగించాడు నందమూరి బాలకృష్ణ. కొన్నాళ్లుగా సరైన హిట్టు లేకపోయినా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో పొలిటికల్ మూవీ కూడా బాగా తెరకెక్కించగలడు అని గుర్తింపు సాధించి, సూపర్ సక్సెస్ సాధించిన తేజ దర్శకత్వంలో సినిమా ప్రారంభోత్సవం కూడా ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ వేడుకకు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అయితే ప్రారంభోత్సవం తర్వాత ఏమైందో ఏమో గానీ ‘ఎన్.టీ.ఆర్’ బయోపిక్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు దర్శకుడు తేజ. ఆ తర్వాత చాలామంది దర్శకులను అనుకున్న బాలయ్యబాబు... చివరికి తన వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి దర్శకత్వం వహించిన యంగ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడికి ఆ బాధ్యత అందించాడు. విడుదల తర్వాత విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూలే అందుకున్న ‘ఎన్.టీ.ఆర్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆ ప్రభావం చూపలేకపోయాయి.
nandamuri balakrishna,balakrishna,balakrishna movies,nandamuri balakrishna funny,nandamuri balakrishna comedy,nandamuri balakrishna movies,nandamuri balakrishna latest news,nandamuri balakrishna cast his vote,nandamuri balakrishna hindupur,mla balakrishna,balakrishna latest,balakrishna speech,balakrishna new movie,balakrishna dialogues,nandamuri balakrishna son,nandamuri balakrishna videos, nbk in ntr,ntr mahanayakudu collections,ntr kathanayakudu boxoffice collections,director teja, teja comments on balayya, balayyababu, teja movies,kajal aggarwal,kajal aggarwal movies,kajal agarwal,kajal aggarwal songs,kajal agarwal movie,kajal,kajal aggarwal sita,kajal aggarwal house,kajal aggarwal spotted,kajal aggarwal interview,kajal aggarwal sita teaser,kajal aggarwal spotted at funqin juhu,kajal agarwal movies in hindi dubbed,:kajal aggarwal,kajal aggarwal cars,kajal aggarwal family,kajal aggarwal speech,kajal aggarwal photos,kajal aggarwal latest, bellamkonda srinivas, hero bellamkonda srinivas,bellamkonda sreenivas,bellamkonda srinivas movies,bellamkonda srinivas movies hindi dubbed,bellamkonda srinivas family,bellamkonda srinivas lifestyle,bellamkonda srinivas full movies,bellamkonda srinivas movies hindi dubbed 2019,srinivas reddy,bellamkonda srinivas age,bellamkonda srinivas wiki,bellamkonda srinivas cars,bellamkonda srinivas house,bellamkonda srinivas facts,actor bellamkonda srinivas,telugu cinema, telugu movie news, tollywood news, తెలుగు సినిమా, టాలీవుడ్, బాలకృష్ణ, ఎన్.టీ.ఆర్, మహానాయకుడు కథానాయకుడు, డైరెక్టర్ తేజ
‘ఎన్.టీ.ఆర్’ ప్రారంభోత్సవ సమయంలో తేజతో చిత్ర యూనిట్

బయోపిక్ మొదటి భాగం ‘ఎన్.టీ.ఆర్- కథానాయకుడు’ డిస్టిబ్యూటర్లకు 50 శాతానికి పైగా నష్టాలను మిగిలిస్తే... వాటిని పూడ్చేందుకు స్వీకెల్‌ ‘ఎన్.టీ.ఆర్- మహానాయకుడు’ను తక్కువ ధరకే అమ్మింది చిత్ర యూనిట్. అయితే పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ‘మహానాయకుడు’ టాలీవుడ్ హిస్టరీలోనే మహా డిజాస్టర్‌గా నిలిచింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం బయోపిక్‌కు ఇలాంటి రియాక్షన్ రావడం తెలుగువారిని ఆశ్చర్యపర్చింది. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడాడు దర్శకుడు తేజ.

nandamuri balakrishna,balakrishna,balakrishna movies,nandamuri balakrishna funny,nandamuri balakrishna comedy,nandamuri balakrishna movies,nandamuri balakrishna latest news,nandamuri balakrishna cast his vote,nandamuri balakrishna hindupur,mla balakrishna,balakrishna latest,balakrishna speech,balakrishna new movie,balakrishna dialogues,nandamuri balakrishna son,nandamuri balakrishna videos, nbk in ntr,ntr mahanayakudu collections,ntr kathanayakudu boxoffice collections,director teja, teja comments on balayya, balayyababu, teja movies,kajal aggarwal,kajal aggarwal movies,kajal agarwal,kajal aggarwal songs,kajal agarwal movie,kajal,kajal aggarwal sita,kajal aggarwal house,kajal aggarwal spotted,kajal aggarwal interview,kajal aggarwal sita teaser,kajal aggarwal spotted at funqin juhu,kajal agarwal movies in hindi dubbed,:kajal aggarwal,kajal aggarwal cars,kajal aggarwal family,kajal aggarwal speech,kajal aggarwal photos,kajal aggarwal latest, bellamkonda srinivas, hero bellamkonda srinivas,bellamkonda sreenivas,bellamkonda srinivas movies,bellamkonda srinivas movies hindi dubbed,bellamkonda srinivas family,bellamkonda srinivas lifestyle,bellamkonda srinivas full movies,bellamkonda srinivas movies hindi dubbed 2019,srinivas reddy,bellamkonda srinivas age,bellamkonda srinivas wiki,bellamkonda srinivas cars,bellamkonda srinivas house,bellamkonda srinivas facts,actor bellamkonda srinivas,telugu cinema, telugu movie news, tollywood news, తెలుగు సినిమా, టాలీవుడ్, బాలకృష్ణ, ఎన్.టీ.ఆర్, మహానాయకుడు కథానాయకుడు, డైరెక్టర్ తేజ
బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి ‘కవచం’ సినిమాలో నటించిన కాజల్ అగర్వాల్, మరోసారి ‘సీత’ కోసం అతనితో జతకట్టింది.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా ‘సీత’ సినిమా చేస్తున్న తేజ... ఆ సినిమా ప్రమోషన్స్‌లో తెగ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ‘ఎన్.టీ.ఆర్’ బయోపిక్ గురించి, బాలయ్య గురించి మాట్లాడాడు తేజ. బయోపిక్ తప్పుకున్నట్టు వార్తలు రాగానే తేజకీ, బాలయ్యకీ మధ్య ఈగో ప్రాబ్లమ్స్ వచ్చాయని, అందుకే డైరెక్టర్ మారాడనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించాడు తేజ. ‘బాలయ్యతో నాకు ఎలాంటి సమస్య రాలేదు. ఆయన దర్శకులకు చాలా సహకరిస్తారు. షాట్ చెబితే ఎలాంటి మార్పులు చెప్పకుండా చేసేస్తారు. ‘ఎన్టీఆర్’ బయోపిక్ కథ లోతుల్లోకి వెళ్లినప్పుడు... అంత లోతైన ఎమోషన్స్‌ను నేను డీల్ చేయలేనని అనిపించింది. అందుకే ఆ సినిమా నుంచి తప్పుకున్నా’ అని కామెంట్ చేశాడు తేజ. అలాగే తాను ఇంతవరకూ ‘ఎన్.టీ.ఆర్’ బయోపిక్ సినిమాలు చూడలేదని చెప్పిన తేజ... తాను ఆ సినిమాను చేసి ఉంటే మరింత అధ్వాన్నంగా వచ్చి ఉండేదమోనని అన్నాడు. అయితే తెలిసో, తెలియకో మరింత అధ్వాన్నంగా అనే మాటలను వాడిన తేజపై బాలయ్య ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ‘ఎన్.టీ.ఆర్’ సినిమా అధ్వాన్నంగా ఉందనే ఉద్దేశంతోనే మరింత ఘోరంగా ఉండేదనే వ్యాఖ్యలు చేశారంటూ తేజపై కస్సుబుస్సులాడుతున్నారు. ఇదిలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి ‘కవచం’ సినిమాలో నటించిన కాజల్ అగర్వాల్, మరోసారి ‘సీత’ కోసం అతనితో జతకట్టింది. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌ను విలనిజం ఛాయలున్న పాత్రలో చూపిస్తున్న ‘సీత’ మే 24న విడుదలవుతోంది.




First published: May 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...