ప్రభాస్‌ చేయాల్సిన స్టోరీతో ఎన్టీఆర్ సినిమా..

ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన స్టోరీని ఇంకో హీరో దగ్గరికి వెళుతుంటాయి. ఒక్కోసారి ఆ కథతో ఆ హీరో జీవితాన్నే మార్చేస్తుంటాయి. అలా ప్రభాస్‌తో చేయాల్సిన ఒక చిత్రం ఇలానే జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకి వెళ్లింది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: December 3, 2019, 10:48 AM IST
ప్రభాస్‌ చేయాల్సిన స్టోరీతో ఎన్టీఆర్ సినిమా..
ప్రభాస్,ఎన్టీఆర్ (Facebook/Photo)
  • Share this:
ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన స్టోరీని ఇంకో హీరో దగ్గరికి వెళుతుంటాయి. ఒక్కోసారి ఆ కథతో ఆ హీరో జీవితాన్నే మార్చేస్తుంటాయి. అలా ప్రభాస్‌తో చేయాల్సిన ఒక చిత్రం ఇలానే జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకి వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. తొలి చిత్రం ‘అతనొక్కడే’ సినిమా నుంచి తాజాగా రిలీజైన ‘సైరా నరసింహారెడ్డి’ వరకు దర్శకుడిగా తన శైలి ఏంటో వెండితెరపై చూపిస్తూనే వున్నాడు దర్శకుడు సురేంద్ రెడ్డి. బాక్సాఫీస్ దగ్గర ఎన్నో భారీ విజయాలను అందుకున్న సురేందర్ రెడ్డి కొన్ని సార్లు మాత్రం హిట్టు కోసం ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. ఇక ఫస్ట్ మూవీ ‘అతనొక్కడే’ చిత్రంతో హిట్టు అందుకున్న సురేందర్ రెడ్డికి వరసగా సినిమా ఛాన్సులు వచ్చిపడ్డాయి. ఇందులో భాగంగా రెండో చిత్రమే ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందట. ఈ విషయమై సురేందర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఆనాటి విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్‌తో అశోక్ సినిమాను తెరకెక్కించిన సురేందర్ రెడ్డి (Facebook/Photo)


కళ్యాణ్ రామ్‌తో ‘అతనొక్కడే’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత  నా సెకండ్ మూవీ ప్రభాస్‌తో తెరకెక్కించాలనుకున్నాను.  కానీ ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. అదే టైమ్‌లో ఎన్టీఆర్‌తో సినిమా ఛాన్స్ వచ్చింది. అలా తారక్‌తో ‘అశోక్’ సినిమాను తెరకెక్కించాను. పైగా అప్పటికీ ఎన్టీఆర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే ఇది ప్రభాస్‌తో అనుకున్న కథ మాత్రం కాదట. ప్రభాస్ కోసం రాసిపెట్టుకున్న స్టోరీనే కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ‘అశోక్’ సినిమాను  తెరకెక్కించాని చెప్పుకొచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 3, 2019, 10:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading