Allu Arjun - Pushpa: ల‌క్ష‌న్న‌ర కోట్ల‌పై బ‌న్నీ ఫోక‌స్‌.. రీజ‌న్ ఇదే..!

Director Sukumar revealed intresting facts about Pushpa movie full details here

Allu Arjun - Pushpa: రీసెంట్‌గా ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సుకుమార్.. ‘పుష్ప‘ కథ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. అవేంటో తెలుసా..

  • Share this:
    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది అల వైకుంఠ‌పురములో సినిమాతో నాన్ బాహుబ‌లి రికార్డులు క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. బేసిగ్గా బ‌న్నీ తెలుగుతో పాటు మ‌ల‌యాళంలో మంచి మార్కెట్ ఉంది. దీంతో ఇప్పుడు బ‌న్నీ త‌న రేంజ్‌ను ప్యాన్ ఇండియాకు పెంచుకోవాల‌ని అనుకున్నాడు. అందులో భాగంగానే సుకుమార్‌తో క‌లిసి పుష్ప సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌న్నీ చేయ‌న‌టువంటి ఓ మాస్ రోల్‌లో ప్రెజంట్ చేస్తున్నాడు సుకుమార్.

    రీసెంట్‌గా ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బ‌న్నీ పుష్ప గురించి మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను రివీల్ చేశాడు. ప్ర‌పంచంలో శేషాచ‌ల అడ‌వుల్లోనే ఎర్ర చంద‌నం దొరుకుతుంది. ఈ ఎర్రచంద‌నంను స్మ‌గ్లింగ్ చేస్తుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్ష‌న్న‌ర కోట్ల రూపాయ‌ల విలువైన ఎర్ర చంద‌నం చైనా, జ‌పాన్ వంటి విదేశాల‌కు ఎగుమ‌తి అయ్యింద‌ట‌. దీనిపై సినిమా ర‌న్ అవుతుంద‌ట‌. ఇంత పెద్ద మొత్తంలో స్మ‌గ్లింగ్ జ‌రిగే పాయింట్ మీద సుకుమార్ ఈ క‌థ‌ను ప్రిపేర్ చేసుకున్నాడు. రీసెర్చ్ చేసే క్ర‌మంలో ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ గురించి చాలా విష‌యాలు తెలిశాయ‌ట‌. వీటిని బేస్ చేసుకుని ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేశాడు. కానీ..చివ‌ర‌కు అది సినిమాగా రూపొందుతుంద‌ని సుకుమార్ తెలియ‌జేశాడు.


    ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో బ‌న్నీ పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఆగ‌స్ట్ 13న తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే మారేడు మిల్లి, రంప‌చోడ‌వ‌రం ప్రాంతాల్లో రెండు షెడ్యూల్స్ పూర్త‌య్యాయి. త‌దుప‌రి షెడ్యూల్ కేర‌ళ‌, తెన్‌కాశీలో జ‌ర‌గ‌నుంది.
    Published by:Anil
    First published: