Allu Arjun: ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఇందులో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు. ఈయన సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీగా ఉండగా గత కొన్ని రోజులు కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇక మళ్లీ తిరిగి షూటింగులు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా తిరిగి షూటింగును ప్రారంభించగా మొత్తానికి షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో ఇందులో అల్లు అర్జున్, రష్మిక మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ కోసం డైరెక్టర్ సుకుమార్ గోవాలో ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ పూర్తయిన వెంటనే గోవాకు పయనం కానుంది. ఇక అక్కడ దాదాపు 15 రోజులపాటు ఈ సినిమా షెడ్యూల్ జరగనుందట.
ఇక ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతుంది. అక్రమ రవాణా గంధపుచెక్కల నేపథ్యంలో తెరకెక్కనుంది ఈ సినిమా. ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు సుకుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పైగా అన్ని భాషలలో తెరకెక్కించడానికి ప్లాన్ కూడా చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సుకుమార్ భారీ అంచనాలతో రూపొందిస్తున్నాడు. ఇందులో బుల్లితెర యాంకర్ అనసూయ, స్టార్ కమెడియన్ సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతాన్ని వినిపిస్తున్నాడు. ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక రష్మిక పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. ఈ సినిమా టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ కూడా అందింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను గతంలో ఆగస్టులో విడుదల చేయాలని సినీ బృందం ప్రకటించగా కరోనా సెకండ్ వేవ్ కారణంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఈ సినిమా విడుదల కాస్త ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Director sukumar, Goa schedule, Pushpa Movie, Rashmika mandanna, Tollywood