DIRECTOR SUKUMAR NOT YET FINALIZED HIS NEW MOVIE AFTER RAMCHARAN RANGASTHALAM MAHESH BABU REJECTED AND ALLU ARJUN SUGGESTS CHANGE FOR HIS STORY AK
రామ్ చరణ్‌తో హిట్ కొట్టినా సుకుమార్ పరిస్థితి మారలేదా ?
దర్శకుడు సుకుమార్
రంగస్థలం విడుదలై ఏడాది గడుస్తున్నా... ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ నెక్ట్స్ మూవీ ఇంకా పట్టాలెక్కలేదు. మహేశ్ బాబు నో చెప్పిన సుకుమార్ తదుపరి సినిమాకు అల్లు అర్జున్ ఓకే చెప్పినా... ఇందులో మరిన్ని మార్పులు జరుగుతున్నాయని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
సినీరంగంలో హిట్ కొట్టిన దర్శకుడు...సాధ్యమైనంత తొందరగా తన నెక్స్ట్ మూవీని పట్టాలెక్కిస్తుంటాడు. ఇక స్టార్ హీరోలు సై అంటే... ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన తదుపరి సినిమాను తొందరగా మొదలుపెట్టాలని భావిస్తుంటారు చాలామంది దర్శకులు. కానీ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ మాత్రం ఈ విషయంలో భిన్నంగా వ్యవహరిస్తుండటం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. దర్శకుడిగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్... రామ్ చరణ్ హీరోగా రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించి... దర్శకుడిగా మరో మెట్టు పైకి ఎదిగాడు.
రంగస్థలం సినిమా ద్వారా దర్శకుడిగా తనేంటో మరోసారి ప్రూవ్ చేసుకోవడంతో పాటు... హీరో రామ్ చరణ్‌లోని యాక్టింగ్ టాలెంట్‌ను పూర్తి స్థాయిలో బయటకు తీశాడు సుకుమార్. అలాంటి సుకుమార్ రంగస్థలం సినిమా విడుదలై ఏడాది పూర్తవుతున్నా... ఇంకా తన తదుపరి సినిమాను పట్టాలెక్కించకపోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. రంగస్థలం తరువాత మహేశ్ బాబుతో సుకుమార్ సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మహేశ్ బాబు కూడా నేనెక్కడినే సినిమా పరాజయాన్ని లైట్ తీసుకుని మరోసారి సుకుమార్‌తో పని చేయడానికి డిసైడయ్యాడు.
అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ... ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది. ఇదే కథను ఇండస్ట్రీలో తన క్లోజ్ ఫ్రెండ్ అయిన స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు చెప్పి ఒప్పించిన సుకుమార్... బన్నీతో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళతాడని అంతా అనుకున్నారు. కానీ... తాజాగా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి మరింత టైమ్ పట్టొచ్చని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. సినిమా కథలో మరిన్ని మార్పులు చేయాలని బన్నీతో పాటు సుకుమార్ కూడా నిర్ణయించుకున్నాడని... అందుకే మరోసారి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కకుండా లేట్ అవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తరువాత కూడా సుకుమార్ ఈ రేంజ్లో గ్యాప్ తీసుకోవడం ఎంతవరకు కరెక్టో ఆయనకే తెలియాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.