అవును చిరంజీవి, రామ్ చరణ్..వెండితెరపై ఒకే సినిమాలో హీరోలుగా నటిస్తే చూడాలని మెగాభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తొందర్లోనే ఆ కోరిక నెరవేరబోతుంది. వివరాల్లోకి వెళితే.. చిరంజీవి..మొదటిసారి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’ సినిమాలో రామ్ చరణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీనువైట్ల డైరెక్షన్లో వచ్చిన ‘బ్రూస్లీ’లో కాసేపు అతిథి పాత్రలో చరణ్ పక్కన కాసేపు కనిపించాడు చిరు. ఇంకోవైపు చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’లో రామ్ చరణ్.. తండ్రితో కలిసి అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ పాటలో కాసేపు అలా కనిపించాడు. వీళ్లిద్దరు మూడు సార్లు స్క్రీన్ షేర్ చేసుకున్న కంప్లీట్‌గా ఒక సినిమా మాత్రం చేయలేదు. తాజాగా వీళ్లిద్దరు పూర్తిస్థాయిలో ఒక సినిమాలో కలిసి నటించడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.

‘సైరా’ షూటింగ్ స్పాట్లో రామ్ చరణ్,చిరంజీవి ( Twitter/Photo)
తాజాగా రామ్ చరణ్.. మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ హీరోగా తెరకెక్కిన ‘లాసిఫర్’ రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నాడు. ఇందులో మరో మలయాళీ హీరో పృథ్వీ రాజ్ కీలక పాత్రలో నటించాడు. తండ్రి చిరంజీవి కోసమే రామ్ చరణ్ ఈ రీమేక్ హక్కుల్ని దక్కించుకున్నాడు. మలయాళంలో మోహన్ లాల్ చేసిన పాత్రను తెలుగులో చిరంజీవి.. పృథ్వీరాజ్ చేసిన పాత్రను తెలుగులో రామ్ చరణ్ చేయనున్నాడు. సమాచారం. ఈ సినిమాను రామ్ చరణ్‌తో ‘రంగస్థలం’ వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన సుకుమార్ ఈ మల్టీస్టారర్‌ను తెరకెక్కించబోతున్నట్టు మెగా ఫ్యామిలీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్‌తో నెక్ట్స్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఈ మెగా మల్టీస్టారర్ పట్టాలెక్కనున్నట్టు సమాచారం. సుకుమార్ ఎంత లేదన్న ఒక సినిమా చేయడానికి యేడాదికి పైగా టైమ్ తీసుకుంటాడు. ఆ లోపు చిరంజీవి
కొరటాల శివ, త్రివిక్రమ్ సినిమాలను కంప్లీట్ చేసి ఫ్రీ అవుతాడు. ఆ తర్వాతే చిరంజీవి, రామ్ చరణ్‌లతో సుకుమార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. Published by:Kiran Kumar Thanjavur
First published:October 13, 2019, 20:37 IST