Allu Arjun Pushpa Release Date: ‘పుష్ప’పై సుకుమార్‌కు షాక్.. అంతా అల్లు అర్జున్ ప్లానే..

అల్లు అర్జున్, సుకుమార్

Allu Arjun Pushpa Release Date: రంగస్థలం తరువాత తన డైరెక్షన్‌లో రాబోతున్న పుష్ప సినిమాను అంతే అద్భుతంగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

  • Share this:
    గతేడాది మొత్తం కరోనాకే అంకితం కావడంతో.. ఈ ఏడాది సాధ్యమైనంత తొందరగా తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు స్టార్స్. ఈ క్రమంలోనే ఎవరికి వాళ్లు.. తమ సినిమా రిలీజ్ తేదీలను ప్రకటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సహా అనేక మంది స్టార్ హీరోల సినిమాల విడుదల తేదీలు ముందుగానే అనౌన్స్ అయిపోయాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లోని నయా మూవీ పుష్ప విడుదల తేదీని కూడా ప్రకటించాడు మూవీ మేకర్స్. ఈ సినిమాను ఆగస్టు 13న ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్టు అనౌన్స్ చేసేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంపై దర్శకుడు సుకుమార్ అసంతృప్తిగా ఉన్నాడనే పుకార్లు టాలీవుడ్‌ సర్కిల్స్‌లో షికారు చేస్తున్నాయి. సాధారణంగా సుకుమార్ తన సినిమాను మిగతా దర్శకులకంటే కాస్త ఎక్కువకాలం చెక్కుతుంటాడు. ప్రతి సీన్ తనకు పర్ఫెక్ట్ అనిపించేంతవరకు సుక్కు అస్సలు కాంప్రమైజ్ కాడనే టాక్ ఉంది. ఇందుకోసం అనేక సీన్లను ఆయన రీషూట్ చేసిన సందర్భాలు ఉన్నాయని సినీజనం చెబుతుంటారు. అంత పర్ఫెక్ట్‌గా సీన్లు తీస్తాడు కాబట్టే.. మేకింగ్‌లో సుకుమార్‌ బెస్ట్ అని చాలామంది అంటుంటారు.

    అలాంటి సుకుమార్... రంగస్థలం తరువాత తన డైరెక్షన్‌లో రాబోతున్న పుష్ప సినిమాను అంతే అద్భుతంగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మూవీ నిర్మాతలు రిలీజ్ డేట్ ప్రకటిచడం సుకుమార్‌కు నచ్చలేదని ప్రచారం సాగుతోంది. ఆగస్టు 13లోపు సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉండదని.. దీనికి ఇంకొంత సమయం పడుతుందని సుకుమార్ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని సుకుమార్ అనుకున్నట్టు టాక్.

    అయితే ఈలోగా నిర్మాతలు.. సినిమాను ఆగస్టు 13న రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం సుకుమార్‌ను నిరాశకు గురి చేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్మాతలపై ఈ రకంగా ఒత్తిడి తీసుకొచ్చింది అల్లు అర్జునే అనే పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి. సినిమాను తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో.. సుకుమార్‌పై అల్లు అర్జున్ ఈ రకమైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశాడేమో అనే టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి పుష్ప మూవీ రిలీజ్ డేట్ విషయంలో లెక్కల మాస్టార్ సుకుమార్ లెక్క సరిపోలేదనే ఊహాగానాలకు ఎవరు తెరదించుతారో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published: