news18-telugu
Updated: April 22, 2020, 8:45 AM IST
‘బీ ది రియల్ మేన్’ చాలెంజ్ స్వీకరించిన కుమార్ (Instagram/Photo)
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ‘బీ ది రియల్ మెన్’ అనే ఛాలెంజ్ నడుస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి ఇంట్లో ఆడవాళ్లకు సాయం చేసే వాడే నిజమైన మగాడు అంటూ ‘బి ది రియల్ మేన్’ అనే ఛాలెంజ్ ప్రారంభించాడు. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో అందరు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి.. ఇంట్లో వాళ్లకు ఇంటి పనుల్లో తోచిన సాయం చేయమని చెప్పడమే ఈ చాలెంజ్ ఉద్దేశ్యం. ఇప్పటికే సందీప్ రెడ్డి.. ఈ ఛాలెంజ్‌కు రాజమౌళిని నామినేట్ చేసాడు. జక్కన్న కూడా ఇంట్లో పనులు చేసి ఈ ఛాలెంజ్‌ను ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు దర్శకుడు సుకుమార్‌తో పాటు కీరవాణి, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా దర్శకుడు రాజమౌళి ‘బి ది రియల్ మెన్’ ఛాలెంజ్ ను స్వీకరించి ఇల్లు ఊడ్వడంతో పాటు ఇంట్లో బాసాన్లు కడిగి తన భార్యకు సహాయం చేసాడు. అంతేకాదు సుకుమార్.. నిర్మాత దిల్ రాజు, దర్శకులు సురేందర్ రెడ్డి, కొరటాల శివతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌కు ఈ ఛాలెంజ్ స్వకరించమని ఛాలెంజ్ విసిరాడు. మొత్తానికి లాక్డౌన్లో ఇంట్లో ఉన్న సెలబ్రిటీలు ఇపుడు ఇంట్లో పనులు చేస్తూ.. అభిమానులతో ప్రజలకు కూడా ఇంట్లో ఆడవాళ్లకు సాయం చేయమని మంచి సందేశం ఇస్తున్నారు.

సుకుమార్ Photo : Twitter
ప్రస్తుతం కరోనా సందర్భంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు రూ. 5 లక్షలు చొప్పున మొత్తం రూ. 10 లక్షలను విరాళంగా అందజేసిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం సుకుమార్.. అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
April 22, 2020, 8:45 AM IST