బాహుబలి సినిమాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా RRR. మెగా హీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఇప్పటికైతే RRRకు రాజమౌళి, రామ్ చరణ్, తారక రామారావు పేర్లలోని R అక్షరాన్ని తీసుకొని వర్కింగ్ టైటిల్‌గా పెట్టారు. సినిమా అసలు టైటిల్ కోసం చాలా కష్టపడ్డారట. టైటిల్ కోసం వేల పదాలను చూశారట. అందులో ఒక టైటిల్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అదే టైటిల్‌ను రాజమౌళి కూడా ఓకే చేశారని సినీ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే.. ‘రఘుపతి రాఘవ రాజారాం’.
కుమ్రం భీం, అల్లూరి సీతారామరాజు జీవితాలను ప్రతిబింబించేలా ఈ సినిమా వస్తోంది. స్వాతంత్ర్యానికి సంబంధించిన ఈ సినిమాకు ఆ టైటిల్ సరిగ్గా సరిపోతుందని రాజమౌళి కూడా అనుకుంటున్నట్లు సమాచారం. ఈ టైటిల్లోనూ RRR కలిసి వస్తున్నందున దీనికే ఓటేశారట. అయితే.. ‘రామ రౌద్ర రుషితం’ అనే టైటిల్ కూడా తెగ ట్రెండ్ అవుతోంది. కొందరు ఇదే టైటిల్ రాజమౌళి ఫిక్స్ చేశారంటూ కామెంట్ చేస్తున్నారు.
కాగా, రఘుపతి రాఘవ రాజారాం ఓ భక్తి గీతం. మహాత్మాగాంధీకి ఇష్టమైన ఈ గీతాన్ని.. ఆయన చాలా సందర్భాల్లో పాడారు. విష్ణు దిగంబర్ పలుస్కర్ ఈ గీతానికి చాలా సాధారణమైన సంగీతాన్ని సమకూర్చారు.
రఘుపతి రాఘవ రాజారామ్.. పతిత పావన సీతారామ్ |
ఈశ్వర అల్లా తేరేనామ్.. సబ్ కో సమ్మతి దే భగవాన్ ||
Published by:Shravan Kumar Bommakanti
First published:March 02, 2020, 07:49 IST