మరో సినిమా ఛాన్స్ పట్టేసిన శ్రీనువైట్ల.. ఇంతకీ ఏ హీరోతో తెలుసా..

శ్రీనువైట్ల ఒకప్పుడు యాక్షన్ చిత్రాలకు కామెడీని మిక్స్ చేసి హిట్లు హిట్లు కొట్టి దర్శకుడిగా మంచి దూకుడు మీదుండే. ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్న శ్రీనువైట్ల మరో సినిమా ఛాన్స్ పట్టేసాడు.

news18-telugu
Updated: February 20, 2019, 11:22 AM IST
మరో సినిమా ఛాన్స్ పట్టేసిన శ్రీనువైట్ల.. ఇంతకీ ఏ హీరోతో తెలుసా..
శ్రీనువైట్ల ఫైల్ ఫోటో
  • Share this:
శ్రీనువైట్ల ఒకప్పుడు యాక్షన్ చిత్రాలకు కామెడీని మిక్స్ చేసి హిట్లు హిట్లు కొట్టి దర్శకుడిగా మంచి దూకుడు మీదుండే. మహేశ్‌కు దూకుడు వంటి బ్లాక్ బస్టర్ అందించిన శ్రీనువైట్ల..అదే మహేశ్‌తో చేసిన ‘ఆగడు’ సినిమాతో ఫ్లాప్ బాట పట్టాడు.

ఆ తర్వాత రామ్ చరణ్‌తో చేసిన ‘బ్రూస్లీ’ ..వరుణ్ తేజ్‌తో చేసిన ‘మిస్టర్’ ..రవితేజతో చేసిన ‘అమర్ అక్బర్ ఆంటోని’  సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాప్‌గా నిలిచాయి. దీంతో దర్శకుడిగా శ్రీనువైట్లకు పిలిచి మరి ఆఫర్లు ఇచ్చే హీరోలే కరువయ్యారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శ్రీనువైట్ల..చీకట్లో చిరుదివ్వెల  మరో హీరో దొరికాడు.

Director Srinu vaitla Next Movie With hero Manchu Vishnu, Srinu Vaitla, Srinu vaitla Manchu Vishnu, Srinu Vaitla manchu vishnu Dhee,Srinu vaitla Manchu Vishnu Dhee Movie Sequel, Tollywood News, Telugu cinema, శ్రీనువైట్ల, శ్రీనువైట్ల మంచు విష్ణు, శ్రీనువైట్ల మంచు విష్ణు ఢీ సీక్వెల్, శ్రీనువైట్ల మంచు విష్ణు ఢీ మూవీ సీక్వెల్, మంచు విష్ణు ఢీ సీక్వెల్, ఢీ మూవీ సీక్వెల్, టాలీవుడ్ న్యూస్, తెలుగు సినిమా
అమర్ అక్బర్ ఆంటోని ఫస్ట్ లుక్ (ట్విట్టర్ ఫోటో)


ఇంతకీ అతనెవరో కాదు..దర్శకుడిగా ‘డీ’ సినిమా చేసిన మంచు విష్ణుతో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి శ్రీనువైట్ల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు హీరోగా మంచు విష్ణు కెరీర్ కూడా ఏమంత బాగాలేదు. ‘దేనికైనా రెడీ’ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు మంచు విష్ణు. దీంతో తనకు ఒకప్పుడు సక్సెస్ ఇచ్చిన శ్రీనువైట్లతో నెక్ట్స్ మూవీ చేయడానికి రెడీ అయినట్టు సమాచారం.ఇపుడు వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా ‘ఢీ’ మూవీకి సీక్వెల్‌గా ఫుల్ కామెడీ ఎంటర్టేనర్‌గా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు. మంచు విష్ణు అంటే ఎలాగో ప్రొడ్యూసర్ అతనే కాబట్టి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. సో..ఫ్లాపుల్లో ఉన్న శ్రీనువైైట్లకు ఇదో బంపరాఫర్ అనే చెప్పాలి. మరి ఈ సినిమాతోనైనా హీరోగా మంచు విష్ణుకు హిట్టు ఇచ్చి దర్శకుడిగా శ్రీనువైట్ల హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది చూడాలి.

First published: February 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>