హిట్టు కొట్టిన ఫ్లాప్ హీరోతోనే.. నెక్ట్స్ మూవీ ప్లాన్ చేసిన శ్రీనువైట్ల..

శ్రీనువైట్ల ఒకప్పుడు యాక్షన్ చిత్రాలకు కామెడీని మిక్స్ చేసి హిట్లు హిట్లు కొట్టి దర్శకుడిగా మంచి దూకుడు మీదుండే. ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్న శ్రీనువైట్ల మరో సినిమా ఛాన్స్ పట్టేసాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 4, 2019, 9:01 AM IST
హిట్టు కొట్టిన ఫ్లాప్ హీరోతోనే.. నెక్ట్స్ మూవీ ప్లాన్ చేసిన శ్రీనువైట్ల..
శ్రీనువైట్ల ఫైల్ ఫోటో (Srinu Vaitla movie)
  • Share this:
శ్రీనువైట్ల ఒకప్పుడు యాక్షన్ చిత్రాలకు కామెడీని మిక్స్ చేసి హిట్టు మీద హిట్టు కొట్టి దర్శకుడిగా మంచి దూకుడు మీదుండే. మహేశ్‌కు దూకుడు వంటి బ్లాక్ బస్టర్ అందించిన శ్రీనువైట్ల..అదే మహేశ్‌తో చేసిన ‘ఆగడు’ సినిమాతో ఫ్లాప్ బాట పట్టాడు. ఆ తర్వాత రామ్ చరణ్‌తో చేసిన ‘బ్రూస్లీ’ ..వరుణ్ తేజ్‌తో చేసిన ‘మిస్టర్’ ..రవితేజతో చేసిన ‘అమర్ అక్బర్ ఆంటోని’  సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాప్‌గా నిలిచాయి. దీంతో దర్శకుడిగా శ్రీనువైట్లకు పిలిచి మరి ఆఫర్లు ఇచ్చే హీరోలే కరువయ్యారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శ్రీనువైట్ల..చీకట్లో చిరుదివ్వెల  మరో హీరో దొరికాడు.ఇంతకీ అతనెవరో కాదు..దర్శకుడిగా ‘డీ’ సినిమా చేసిన మంచు విష్ణు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను శ్రీనువైట్లతో చేయడానికి  ఒప్పకున్నాడు. ఈ విషయాన్ని మంచు విష్ణు అఫీషియల్‌గా  ప్రకటించాడు. ప్రస్తుతం మంచు విష్ణు ‘ఓటర్’ సినిమా చేస్తున్నాడు. సార్వత్రిక ఎన్నికల ముందు రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను అనివార్య కారణాలతో వాయిదా వేసారు. కార్తీక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సురభి కథానాయికగా నటిస్తోంది.

Director Srinu vaitla Next Movie With hero Manchu Vishnu, Srinu Vaitla, Srinu vaitla Manchu Vishnu, Srinu Vaitla manchu vishnu Dhee,Srinu vaitla Manchu Vishnu Dhee Movie Sequel, Tollywood News, Telugu cinema, శ్రీనువైట్ల, శ్రీనువైట్ల మంచు విష్ణు, శ్రీనువైట్ల మంచు విష్ణు ఢీ సీక్వెల్, శ్రీనువైట్ల మంచు విష్ణు ఢీ మూవీ సీక్వెల్, మంచు విష్ణు ఢీ సీక్వెల్, ఢీ మూవీ సీక్వెల్, టాలీవుడ్ న్యూస్, తెలుగు సినిమా
అమర్ అక్బర్ ఆంటోని ఫస్ట్ లుక్ (ట్విట్టర్ ఫోటో)


త్వరలో ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.  మరోవైపు హీరోగా మంచు విష్ణు కెరీర్ కూడా ఏమంత బాగాలేదు. ‘దేనికైనా రెడీ’ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు మంచు విష్ణు. దీంతో తనకు ఒకప్పుడు సక్సెస్ ఇచ్చిన శ్రీనువైట్లతో నెక్ట్స్ మూవీ చేయడానికి రెడీ అయ్యాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిని ‘ఢీ’ మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నారు.

Director Srinu vaitla Next Movie With hero Manchu Vishnu Officially Confirmed,శ్రీనువైట్ల ఒకప్పుడు యాక్షన్ చిత్రాలకు కామెడీని మిక్స్ చేసి హిట్లు హిట్లు కొట్టి దర్శకుడిగా మంచి దూకుడు మీదుండే. ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్న శ్రీనువైట్ల మరో సినిమా ఛాన్స్ పట్టేసాడు.Srinu Vaitla,Srinu vaitla Manchu Vishnu,Srinu Vaitla manchu vishnu Dhee,Srinu vaitla Manchu Vishnu Dhee Movie Sequel,manchu vishnu voter,Manchu vishnu voter movie,Tollywood News,Telugu cinema,Srinu vaitla Raviteja amar akbar antony,Sinu vaitla Flop,Tollywood News,Telugu cinema,Andhra pradesh,Andhra Pradesh Politcis,శ్రీనువైట్ల,శ్రీనువైట్ల మంచు విష్ణు,శ్రీనువైట్ల మంచు విష్ణు ఢీ సీక్వెల్, శ్రీనువైట్ల మంచు విష్ణు ఢీ మూవీ సీక్వెల్,మంచు విష్ణు ఢీ సీక్వెల్,ఢీ మూవీ సీక్వెల్,టాలీవుడ్ న్యూస్, తెలుగు సినిమా,
‘ఢీ’ మూవీ


మంచు విష్ణు అంటే ఎలాగో ప్రొడ్యూసర్ అతనే కాబట్టి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. సో..ఫ్లాపుల్లో ఉన్న శ్రీనువైైట్లకు ఇదో బంపరాఫర్ అనే చెప్పాలి. మరి ఈ సినిమాతోనైనా హీరోగా మంచు విష్ణుకు హిట్టు ఇచ్చి దర్శకుడిగా శ్రీనువైట్ల తానేంటో ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది చూడాలి.
First published: April 4, 2019, 9:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading