గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన శ్రీనువైట్ల.. కాజల్, సోనూసూద్‌ను సవాల్ విసిరిన దర్శకుడు..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన దర్శకుడు శ్రీను వైట్ల (Twitter/Photo)

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ ప్రకృతి ప్రేమికులను కదిలిస్తుంది.తాజాగా దర్శకుడు శ్రీను వైట్ల గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాడు.

 • Share this:
  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ ప్రకృతి ప్రేమికులను కదిలిస్తుంది. ఒక్కొక్కరుగా మొక్కలు నాటుతూ తమ సన్నిహితులను నామినేట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళుతున్నారు.  ఇందులో భాగాంగా నిర్మాత, నటులు బండ్ల గణేష్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన శ్రీను వైట్ల ఈ రోజు హైదరాబాద్, జర్నలిస్ట్ కాలనీలోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం శ్రీను వైట్ల మాట్లాడుతూ.. గత మూడు దశాబ్ధాల్లో రాజకీయ నాయకుల నుంచి సమాజానికి ఉపయోగపడే ఇంతమంచి మానవీయ కార్యక్రమాన్ని ఎపుడు చూడలేదన్నారు.  మొదటిసారిగా జోగినిపల్లి సంతోష్ తన అద్భుతమైన మనస్సుతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి రూపకల్పన చేసి నిరంతరం ముందుకు తీసుకుపోతూ.. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నారు. వారికి  శ్రీను వైట్ల అభినందనలు తెలియజేసారు.


  director srinu vaitla accept green india challenge and plants saplings and nominates kajal aggarwal and sonu sood many others,srinu vaitla,mp santosh green india challenge,green india challenge,srinu vaitla accept green india challenge,srinu vaitla nomintes sonu sood kajal aggarwal,tollywood,telugu cinema,గ్రీన్ ఇండియా ఛాలెంజ్,శ్రీను వైట్ల గ్రీన్ ఇండియా ఛాలెంజ్,గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన శ్రీను వైట్ల,శ్రీను వైట్ల సోనూ సూద్,శ్రీను వైట్ల కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్‌కు శ్రీనువైట్ల గ్రీన్ ఇండియా ఛాలెంజ్
  గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన దర్శకుడు శ్రీను వైట్ల (Twitter/Photo)


  అనంతరం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి తనవంతు బాధ్యతగా.. టాలీవుడ్ అందాల కాజల్ అగర్వాల్, నటుడు- సమాజ సేవకుడు సోనూసుద్, టాలీవుడ్ యంగ్ హీరో విష్ణు మంచు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, టీఎస్ఎండీసీ ఎండీ మల్సూర్, ప్రముఖ రచయిత గోపి మోహన్ ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు  నామినేట్ చేస్తున్నట్టు తెలియజేసారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: