DIRECTOR SRIKANTH ADDALA ALL PRAISES ON JABARDAST EMMANUEL FOR HIS PERFORMANCE MNJ
Jabardast Emmanuel: ఇమ్మాన్యుల్ ని మెచ్చుకున్న క్లాస్ దర్శకుడు.. సినిమాలో ఛాన్స్ ఇస్తాడా
జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్ది ఏ కులం, ఏ మతం అని గూగుల్‌లో నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఆ తర్వాత అతడిది ఏ ఊరు అనే సెర్చ్ టాప్‌లో ఉంది. (Image: Instagram)
Jabardast Emmanuel: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్‌ని ఇస్తోంది. ఈ షోలో పాల్గొని చాలా మంది పాపులారిటీని సంపాదించుకున్నారు. వారిలో కొందరు సినిమాల్లోనూ దూసుకుపోతుండగా.. కొత్త కొత్త టాలెంట్‌కి సైతం ఆ స్టేజ్ వేదికగా మారింది.
Jabardast Emmanuel: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్‌ని ఇస్తోంది. ఈ షోలో పాల్గొని చాలా మంది పాపులారిటీని సంపాదించుకున్నారు. వారిలో కొందరు సినిమాల్లోనూ దూసుకుపోతుండగా.. కొత్త కొత్త టాలెంట్‌కి సైతం ఆ స్టేజ్ వేదికగా మారింది. ఇక ఈ షోలో ఇప్పుడు అందరినీ మెప్పిస్తోన్న కమెడియన్లలో ఇమ్మాన్యుల్ ఒకడు. అవినాష్ బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తరువాత కెవ్వు కార్తీక్ టీమ్‌లో కీలక పాత్ర పోషించాడు ఇమ్మాన్యుల్. ఆ సమయంలో కెవ్వు కార్తీక్ వరుసగా హిట్లు కొట్టగా.. ఆ క్రెడిట్ ఎక్కువగా ఇమ్మాన్యుల్కి దక్కింది. అంతేకాదు ఒకానొక సమయంలో ఎక్స్ట్రా జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్ టీమ్‌కి గట్టి పోటీని ఇచ్చాడు ఇమ్ము. ఇక ఆ తరువాత అతడికి వర్ష తోడు కాగా.. వీరిద్దరి జోడీ అభిమానులను బాగా ఎంటర్టైన్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ లవర్స్‌గా ఈ జోడీ పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు కేవలం అవినాష్ టీమ్‌కి పరిమితం అవ్వకుండా.. అన్నీ టీమ్‌లలో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఇమ్మాన్యుల్.
ఇదిలా ఉంటే తాజాగా ఈ కమెడియన్‌పై క్లాస్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్రశంసలు కురిపించారు. ఎక్స్ట్రా జబర్దస్త్ చూసేందుకు శేఖర్ మాస్టర్‌తో సహా సెట్స్‌కి వెళ్లారు అడ్డాల. అదే సమయానికి వెంకీ మంకీస్ టీమ్ ప్రదర్శన చేసింది. ఆ స్కిట్‌ని చూసిన అడ్డాల.. నీ స్పాంటేనియస్ బావుందంటూ ఇమ్మాన్యుల్ని మెచ్చుకున్నారు.
అయితే ఇమ్మాన్యుల్కి ఇప్పటికే చాలా మంది ప్రశంసలు కురిపించారు. అయితే ఈ కమెడియన్‌కి ఇంతవరకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. మరి ఇప్పుడు అడ్డాల ఇమ్మాన్యుల్కి అవకాశం ఇస్తారేమో చూడాలి. కాగా అడ్డాల, వెంకటేష్‌తో నారప్ప అనే చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో విజయం సాధించిన అసురన్ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కగా.. మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.