హోమ్ /వార్తలు /సినిమా /

Shankar Anniyan remake: చూసుకుందాం మీ ప్రతాపం నా ప్రతాపం.. వెనకుడుగు వేసేదే లేదంటున్న శంకర్..!

Shankar Anniyan remake: చూసుకుందాం మీ ప్రతాపం నా ప్రతాపం.. వెనకుడుగు వేసేదే లేదంటున్న శంకర్..!

ఈ సినిమా ఎలా ఉండబోతుంది.. దాని జోనర్ ఏంటనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. దీనిపై తాజాగా కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలోనే రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య టెక్నికల్ సినిమాల వైపు వెళ్లిన శంకర్.. రామ్ చరణ్‌తో మాత్రం పొలిటికల్ థ్రిల్లర్ చేయబోతున్నాడు.

ఈ సినిమా ఎలా ఉండబోతుంది.. దాని జోనర్ ఏంటనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. దీనిపై తాజాగా కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలోనే రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య టెక్నికల్ సినిమాల వైపు వెళ్లిన శంకర్.. రామ్ చరణ్‌తో మాత్రం పొలిటికల్ థ్రిల్లర్ చేయబోతున్నాడు.

Shankar Anniyan remake: చూస్తుంటే అన్నియన్(Anniyan) సినిమా రీమేక్ విషయం చిలికి చిలికి గాలివానలా మారేలా కనిపిస్తుంది. ఈ చిత్ర హిందీ రీమేక్ నిలిపేయాలని నిర్మాత ఆస్కార్ వి రవిచంద్రన్(Oscar V Ravichandran) లీగల్ నోటీసు పంపించిన ఒక్క రోజు గడువులోనే శంకర్(Shankar) కూడా తన రిప్లై ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఇంకా చదవండి ...

కొన్ని రోజులుగా శంకర్ టైమ్ పెద్దగా బాగుండటం లేదు. అందుకే ఆయనేం చేసినా కూడా కలిసి రావడం లేదు. మునపటి శంకర్‌ను ప్రేక్షకులకు చూపించడం కోసం ఏమేమో చేస్తున్నాడు ఈయన. అందులో భాగంగానే తన సినిమాలు తానే రీమేక్ చేస్తున్నాడు కూడా. చేస్తున్న సినిమాలు ప్రేక్షకులకు నచ్చడం లేదు.. చేయాల్సిన సినిమాలు మధ్యలోనే అటకెక్కుతున్నాయి.. చేయబోయే సినిమాలకు ఆదిలోనే ఆటంకాలు వస్తున్నాయి. అసలు శంకర్ టైమ్ ఏంటో ఆయనకే అర్థం కావడం లేదు. అసలు విషయం ఏంటంటే.. కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాను మధ్యలోనే వదిలేసిన ఈయన.. ఈ మధ్యే రామ్ చరణ్ సినిమాకు కమిటయ్యాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఇదిలా ఉండగానే తాజాగా హిందీలో రణ్‌వీర్ సింగ్ హీరోగా అన్నియన్ సినిమాను రీమేక్ చేయాలని ముందుకొచ్చాడు. ఈ సినిమా అపరిచితుడుగా తెలుగులోనూ సంచలన విజయం సాధించింది. విక్రమ్ అప్పట్నుంచే తెలుగులో కూడా స్టార్ అయిపోయాడు. అయితే ఈ చిత్ర కథ హక్కులు తన దగ్గర ఉన్నపుడు రీమేక్ ఎలా చేస్తున్నాడు అంటూ శంకర్‌కు అన్నియన్ నిర్మాత రవిచంద్రన్ లీగల్ నోటీసు పంపించాడు.

ఈ సినిమాపై సర్వ హక్కులు తనకే ఉన్నాయని ఆయన తెలిపాడు. అయితే ఇప్పుడు దీనిపై శంకర్ కూడా స్పందించాడు. రవిచంద్రన్‌కు రాసిన లేఖలో అపరిచితుడు కథపై సర్వ హక్కులు తనకు మాత్రమే ఉన్నాయని శంకర్ చెప్పినట్లు తెలుస్తుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం శంకర్ అనే ట్యాగ్‌పైనే అన్నియన్ విడుదలైందని.. ఈ సినిమాకు నిర్మాతగా మీరు ఎన్నో లాభాలు చూసారని శంకర్ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.

Shankar,Shankar twitter,Shankar anniyan hindi remake ranveer singh,Shankar V Ravichandran anniyan producer,anniyan producer V Ravichandran sends legal notice to shankar,telugu cinema,శంకర్,శంకర్‌కు లీగల్ నోటీస్ పంపిన ఆస్కార్ వి రవిచంద్రన్,శంకర్ అన్నియన్ రీమేక్
శంకర్ రణ‌్‌వీర్ సింగ్ (Shankar, Ranveer Singh)

కథ, పాత్రలు మాత్రం పూర్తిగా తనవే అని.. తన బుర్రలోంచి వచ్చిన ఈ కారెక్టర్స్‌ను, కథను ఏం చేసుకోడానికైనా సర్వ హక్కులు తనకే ఉన్నాయని శంకర్ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రచయిత దివంగత సుజాతకు కూడా ఈ కథతో సంబంధం లేదని తేల్చేసాడు. ఈ సినిమాకు మాటలు మాత్రమే రాసారని చెప్పుకొచ్చాడు శంకర్. తన కథను ఏమైనా చేసుకునే హక్కు తనకు ఉందని తెలిపాడు ఈ దర్శకుడు. ఈయన తీరు, సమాధానం చూస్తుంటే వెనకడుగు వేసే ముచ్చటే లేనట్లు స్పష్టంగా అర్థమవుతుంది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Shankar, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు