Shankar | దర్శకుడు శంకర్ ఒకప్పుడు తన చిత్రాలతో మొత్తం సౌత్ ఇండస్ట్రీతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమను తనవైపు తిప్పుకునేలా చేసాడు. వరుసగా సక్సెస్‌పుల్ చిత్రాలతో రాజమౌళి కంటే ముందు ఈయన పేరు మారుమోగిపోయింది. ‘రోబో’ వరకు దర్శకుడిగా ఈయన జైత్రయాత్ర నిరాటంకంగా కొనసాగింది. ఎపుడైతే... విక్రమ్‌తో చేసిన ‘ఐ’ మనోహరుడు సినిమా తర్వాత దర్శకుడిగా శంకర్ ట్రాక్ తప్పాడు. అప్పటి వరకు కథకు తనదైన సాంకేతికతను ఉపయోగించుకొని విజయాలు అందున్న శంకర్. .ఆ తర్వాత కథా బలం లేని సినిమాలతో తేలిపోయాడు. . ఐ సినిమా తర్వాత చేసిన ‘రోబ్ సీక్వెల్ 2.O సినిమా కేవలం గ్రాఫిక్స్ వరకు ఓకే అనిపించినా.. కథ విషయంలో తేలిపోయింది.
ప్రస్తుతం శంకర్..కమల్ హాసన్‌తో ‘భారతీయుడు2’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఏ ముహూర్తానా ఈ సినిమాకు స్టార్ట్ చేసారో.. అప్పటి నుంచి ఈ సినిమా మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో కొంత మంది టెక్నీషియన్స్ ప్రమాదంలో చనిపోవడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. దానికి తోడు కరోనా కూడా తోడైంది. ఈ సినిమాను ఎపుడు మళ్లీ సెట్స్ పైకి తీసుకెళదమనే లోపు.. కమల్ హాసన్ .. కాలి ఆపరేషన్ కోసం కొన్ని రోజుల బ్రేక్ తీసుకున్నారు. ఆ తర్వాత తమిళనాడు ఎన్నికల వరకు కమల్ హాసన్ సినిమాలపై చూసే అవకాశం లేదు.

కమల్ హాసన్ (Kamal Haasan Shankar Indian 2)
అందుకే శంకర్ .. భారతీయుడు 2 సినిమా సెట్స్ పైకి వెళ్లే లోపు మరో ప్యాన్ ఇండియా స్టోరిని రెడీ చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని శంకర్.. కేజీఎఫ్ స్టార్‌తో నిర్మించే ఆలోచనలో ఉన్నాడట.

శంకర్, యశ్ (File/Photo)
ఇప్పటికే యశ్‌కు కథ వినిపించి ఓకే చేయించుకున్నట్టు సమాచారం. త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:January 21, 2021, 21:29 IST