హోమ్ /వార్తలు /సినిమా /

Shankar: ఆ విషయంలో దర్శకుడు శంకర్‌కు ఊరట.. ఊపిరి పీల్చుకుంటున్న మెగాభిమానులు.

Shankar: ఆ విషయంలో దర్శకుడు శంకర్‌కు ఊరట.. ఊపిరి పీల్చుకుంటున్న మెగాభిమానులు.

ఈ సినిమా ఎలా ఉండబోతుంది.. దాని జోనర్ ఏంటనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. దీనిపై తాజాగా కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలోనే రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య టెక్నికల్ సినిమాల వైపు వెళ్లిన శంకర్.. రామ్ చరణ్‌తో మాత్రం పొలిటికల్ థ్రిల్లర్ చేయబోతున్నాడు.

ఈ సినిమా ఎలా ఉండబోతుంది.. దాని జోనర్ ఏంటనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. దీనిపై తాజాగా కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలోనే రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య టెక్నికల్ సినిమాల వైపు వెళ్లిన శంకర్.. రామ్ చరణ్‌తో మాత్రం పొలిటికల్ థ్రిల్లర్ చేయబోతున్నాడు.

Shankar: ఆ విషయంలో దర్శకుడు శంకర్‌కు ఊరట.. ఊపిరి పీల్చుకుంటున్న మెగాభిమానులు. వివరాల్లోకి వెళితే..

    Shankar: ఆ విషయంలో దర్శకుడు శంకర్‌కు ఊరట.. ఊపిరి పీల్చుకుంటున్న మెగాభిమానులు. వివరాల్లోకి వెళితే... ఒకప్పుడు దక్షిణాది భారీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శంకర్.  ఈయన చిత్రాలంలే భారీ గ్రాఫిక్స్, హంగులు ఆర్భాటాలు ఉండాల్సిందే. భారతీయ తెరపై రానీ డిఫరెంట్ స్టోరీలతో తనదైన మార్క్ చూపించారు. సామాజిక సమస్యలే శంకర్ సినిమాలకు ప్రధాన కథా వస్తువులు. సోషల్ ప్రాబ్లెమ్స్‌కు కమర్షియల్ హంగులు అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి.అంతేకాదు భారతీయ సినిమా మేకింగ్ స్టైల్ మార్చిన గ్రేట్ డైరెక్టర్. చివరగా ఈయన ‘2.O’ సినిమాతో పలకరించాడు. ఈ సినిమా మేకింగ్ బాగున్న కథ లేకపోవడంతో అనకున్న రేంజ్‌లో నడవలేదు.

    ఈ సినిమా చూసిన తర్వాత దర్శకుడు శంకర్‌ ఏంటి ఇలాంటి సినిమా తీసాడు అని అందరు అనుకున్నారు. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్‌తో భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2)ను స్టార్ట్ చేసాడు.

    dil raju pan indian movies,dil raju,dil raju twitter,dil raju instagram,dil raju movies,dil raju ram charan shankar movie,dil raju prabhas prashanth neel movie,dil raju vijay prashanth neel movie,telugu cinema,దిల్ రాజు,దిల్ రాజు భారీ సినిమాలు,దిల్ రాజు రామ్ చరణ్ శంకర్ సినిమా,దిల్ రాజు ప్రభాస్ ప్రశాంత్ నీల్ సినిమా,దిల్ రాజు విజయ్ ప్రశాంత్ నీల్ సినిమా
    రామ్ చరణ్ శంకర్ (Ram Charan Shankar)

    ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి అనుకోని అవాంతరాలు ఎదురువుతూనే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంతో కొంత మంది కన్నుమూయడంతో ఈ సినిమాకు బ్రేక్ పడింది. ఆ తర్వాత కమల్ హాసన్.. తమిళనాడు ఎన్నికల్లో బిజీ కావడంతో ఈ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ సమయంలో శంకర్, దిల్ రాజు నిర్మాణంతో రామ్ చరణ్ హీరోగా సినిమాను అనౌన్స్ చేసాడు.

    pawan kalyan,ram charan,pawan kalyan ram charan shankar movie,ram charan pawan kalyan shankar multistarrer movie,pawan kalyan movies,pawan kalyan ram charan multistarrer movie details,shankar to direct ram charan pawan kalyan,ram charan pawan kalyan multi starrer movie,ram charan pawan kalyan,ram charan pawan kalyan movie,pawan kalyan and ram charan,రామ్ చరణ్,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ శంకర్ సినిమా,శంకర్ దర్శకత్వంలో చరణ్ పవన్ మల్టీస్టారర్
    కమల్ హాసన్, శంకర్ భారతీయుడు 2 (Kamal Haasan Shankar Indian 2)

    జూన్ నుంచి పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో లైకా ప్రొడక్షన్స్ వాళ్లు.. శంకర్‌కు నోటీసులు పంపించారు. ముందుగా మాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం .. ‘ఇండియన్ 2’ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత కానీ వేరే సినిమా చేయడానికి వీలు లేదు. ఈ క్రమంలో తమ సంస్థతో శంకర్ చేసుకున్న ఒప్పందం ప్రకారం వేరే ప్రాజెక్ట్ టేకప్ చేయకుండా లైకా ప్రొడక్షన్స్ వాళ్లు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

    ఇండియన్ 2 Photo : Facebook.com/shankarofficial

    ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ వాళ్లు తమ పిటిషన్‌లో ఈ చిత్ర నిర్మాణం కోసం రూ. 150 కోట్లతో తెరకెక్కించేలా ప్లాన్ చేసాము. ఆ తర్వాత బడ్జెట్ కాస్తా రూ. 236 కోట్లకు చేరింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తైయింది. ఈ సినిమా కోసం దర్శకుడు శంకర్‌కు రూ. 40 కోట్ల పారితోషకంలో రూ. 14 కోట్లను చెల్లించినట్టు కోర్టుకు తెలిపారు. ఆయనకు ఇవ్వాల్సిన రూ. 26 కోట్లను కోర్టుకు ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్ల రూపంలో సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అందువల్ల శంకర్ ముందుగా... మాతో తీస్తోన్న ‘ఇండియన్ 2’ సినిమాను కంప్లీట్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అప్పటి వరకు శంకర్ వేరే ప్రాజెక్ట్ టేకప్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలన్నారు. మరోవైపు శంకర్ తరుపున న్యాయవాది వాదనలు విన్న న్యాయమూర్తి పి.టి.ఆషా లైకా ప్రొడక్షన్స్ కోరుకున్నట్టు స్టే విధించలేమని తీర్పు ఇచ్చారు. పైగా ఈ కేసులో శంకర్ .. ఇండియన్ 2తో పాటు మరో సినిమా  ఎందుకు ఒప్పుకున్నాడో తెలియజేస్తూ వివరణ ఇవ్వాలని ఈ నెల 15వ తేదికి తదుపరి విచారణను వాయిదా వేశారు. మొత్తంగా ఈ కేసులో శంకర్‌కు ఊరట లభిస్తుందా లేదా అనేది చూడాలి.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Indian 2, Kamal haasan, Kollywood, Madras high court, Ram Charan, Shankar, Tollywood

    ఉత్తమ కథలు