హోమ్ /వార్తలు /సినిమా /

Shankar: శంకర్.. మీ రేంజ్ ఏంటి.. మీరు చేస్తున్నదేంటి.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్..

Shankar: శంకర్.. మీ రేంజ్ ఏంటి.. మీరు చేస్తున్నదేంటి.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్..

Shankar: శంకర్(Shankar) సినిమాల్లో నమ్బన్ ముందు వరకు కూడా బ‌ల‌మైన క‌థ‌లు కనిపించేవి. కానీ కొన్నేళ్లుగా పూర్తిగా విజువ‌ల్స్ మీదే ఆధార‌ప‌డుతున్నాడు. రోబోలో క‌థ‌తో పాటు విజువ‌ల్స్ వ‌స్తాయి. కానీ ఇప్పుడు అలా కాదు.. క‌థ లేకుండా కేవ‌లం గ్రాఫిక్స్ మాత్ర‌మే క‌నిపిస్తుంది.

ఇంకా చదవండి ...

ఒక‌ప్పుడు శంక‌ర్ సినిమా అంటే బ‌ల‌మైన క‌థ‌తో పాటు విజువ‌ల్ కూడా ఉండేది. కానీ ఎందుకో తెలియ‌దు కానీ కొన్నేళ్లుగా శంక‌ర్ సినిమాల్లో క‌థ ఉండ‌టం లేదు కేవలం విజువ‌ల్స్ మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. పదేళ్ళ కింద వచ్చిన నమ్బన్ సినిమా నుంచే శంక‌ర్ మారిపోయాడు. ఇదే సినిమాను తెలుగులో స్నేహితుడు పేరుతో డబ్బింగ్ చేసారు. నమ్బన్ ముందు వరకు కూడా బ‌ల‌మైన క‌థ‌లు చెప్పిన ఈ ద‌ర్శ‌కుడు.. కొన్నేళ్లుగా పూర్తిగా విజువ‌ల్స్ మీదే ఆధార‌ప‌డుతున్నాడు. రోబోలో క‌థ‌తో పాటు విజువ‌ల్స్ వ‌స్తాయి. కానీ ఇప్పుడు అలా కాదు.. క‌థ లేకుండా కేవ‌లం గ్రాఫిక్స్ మాత్ర‌మే క‌నిపిస్తుంది. ఎంత‌సేపూ అక్క‌డ విజువ‌ల్స్ మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి కానీ శంక‌ర్ విజ‌న్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. మూడేళ్ళ కింద వచ్చిన 2.0లో కూడా విజువల్స్ తప్ప మ్యాటర్ లేదు. దాంతో సినిమా డిజాస్టర్ అయింది. ఇండియ‌న్ సినిమానా లేదంటే హాలీవుడ్ సినిమానా అనే అనుమానం వ‌చ్చేలా తెర‌కెక్కించాడు శంక‌ర్. కానీ నిజంగా సినిమా బాగుందా అంటే మాత్రం నో అనే స‌మాధాన‌మే వ‌స్తుంది. ఈ విష‌యంలో రోబో చాలా ముందుంది.

ఎందుకంటే అందులో గ్రాఫిక్స్ త‌క్కువ‌.. క‌థ ఎక్కువ‌గా ఉంది. కానీ సీక్వెల్ అలా కాదు. అస‌లు క‌థే లేకుండా కేవ‌లం గ్రాఫిక్స్‌తోనే క‌థ న‌డిపించాడు శంక‌ర్. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. కొన్నేళ్లుగా శంక‌ర్ ఇలా త‌డ‌బ‌డ‌టానికి కార‌ణం కూడా ఉంది.

shankar shnmugam,shankar shnmugam twitter,shankar ram charan movie,shankar hindi remake anniyan movie,shankar ranveer singh movie,shankar anniyan remake ranveer singh,tamil cinema,శంకర్,శంకర్ సినిమాలు,శంకర్ అపరిచితుడు రీమేక్
శంకర్, రామ్ చరణ్ రణ్‌వీర్ సింగ్ (File/Photo)

ఒకప్పుడు ఆయ‌న ద‌గ్గ‌ర ముగ్గురు రైట‌ర్స్ ఉండేవాళ్లు. అందులో ఓ సీనియ‌ర్ చ‌నిపోయాడు.. ఆ త‌ర్వాత ఇద్ద‌రు బ‌య‌టికి వెళ్లిపోయారు. అట్లీ కుమార్ కూడా ఇందులో ఒక‌రు. అలా ఇప్పుడు శంక‌ర్ ఒంట‌రివాడు అయిపోయాడు. దాంతో ఆయ‌న విజువ‌ల్స్‌పైనే ఎక్కువ‌గా దృష్టి పెడుతున్నాడు కానీ ఆ మోజులో ప‌డి క‌థ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు అనే విమ‌ర్శ‌లు ఉన్నాయి. 2.0 కు కూడా ఇదే జ‌రిగింది. టేకింగ్ అండ్ మేకింగ్‌లో ఆయ‌న కింగ్.. కానీ క‌థ విష‌యంలో మాత్రం వెన‌క‌బ‌డ్డాడు అంటున్నారు.

shankar shnmugam,shankar shnmugam twitter,shankar ram charan movie,shankar hindi remake anniyan movie,shankar ranveer singh movie,shankar anniyan remake ranveer singh,tamil cinema,శంకర్,శంకర్ సినిమాలు,శంకర్ అపరిచితుడు రీమేక్
శంకర్ రణ‌్‌వీర్ సింగ్ (Shankar, Ranveer Singh)

భార‌తీయుడు 2 సినిమాను కూడా మధ్యలోనే ఆపేసాడు. ఇప్పుడు రామ్ చరణ్‌తో పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. ఇంతలోనే ఇప్పుడు రణ్‌వీర్ సింగ్ హీరోగా 15 ఏళ్ల నాటి అపరిచితుడు సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఏదేమైనా కథల్లేక తాను చేసిన కథలనే మళ్లీ మళ్లీ చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఏదేమైనా శంకర్ ఒకప్పుడు ఎలా ఉండేవాడు.. ఇప్పుడెలా ఉన్నాడు అంటూ ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు.

First published:

Tags: Shankar, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు