హోమ్ /వార్తలు /సినిమా /

Shankar: భారతీయుడు 2 సినిమా ఆగిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు శంకర్..

Shankar: భారతీయుడు 2 సినిమా ఆగిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు శంకర్..

ఈ సినిమా ఎలా ఉండబోతుంది.. దాని జోనర్ ఏంటనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. దీనిపై తాజాగా కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలోనే రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య టెక్నికల్ సినిమాల వైపు వెళ్లిన శంకర్.. రామ్ చరణ్‌తో మాత్రం పొలిటికల్ థ్రిల్లర్ చేయబోతున్నాడు.

ఈ సినిమా ఎలా ఉండబోతుంది.. దాని జోనర్ ఏంటనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. దీనిపై తాజాగా కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలోనే రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య టెక్నికల్ సినిమాల వైపు వెళ్లిన శంకర్.. రామ్ చరణ్‌తో మాత్రం పొలిటికల్ థ్రిల్లర్ చేయబోతున్నాడు.

Shankar: శంకర్..  ఒకప్పుడు దక్షిణాది భారీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఇండియన్ 2 సినిమాను త్వరలో పట్టాలెక్కించనున్నట్టు ప్రకటించారు.

  Shankar: శంకర్..  ఒకప్పుడు దక్షిణాది భారీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.  ఈయన చిత్రాలంలే భారీ గ్రాఫిక్స్, హంగులు ఆర్భాటాలు ఉండాల్సిందే. భారతీయ తెరపై రానీ డిఫరెంట్ స్టోరీలతో తనదైన మార్క్ చూపించారు. సామాజిక సమస్యలే శంకర్ సినిమాలకు ప్రధాన కథా వస్తువులు. సోషల్ ప్రాబ్లెమ్స్‌కు కమర్షియల్ హంగులు అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి.అంతేకాదు భారతీయ సినిమా మేకింగ్ స్టైల్ మార్చిన గ్రేట్ డైరెక్టర్. చివరగా ఈయన ‘2.O’ సినిమాతో పలకరించాడు. ఈ సినిమా మేకింగ్ బాగున్న కథ సరిగా లేకపోవడంతో అనకున్న రేంజ్‌లో నడవలేదు. ఈ సినిమా తర్వాత శంకర్.. కమల్ హాసన్ హీరోగా భారతీయడు సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు 2 సినిమాను స్టార్ట్ చేసాడు. ఈ సినిమాను తమిళంలో ఇండియన్ 2 పేరుతో తెరకెక్కుతోంది.

  ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి అనుకోని అవాంతరాలు ఎదురువుతూనే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంతో కొంత మంది కన్నుమూయడంతో ఈ సినిమాకు బ్రేక్ పడింది. ఆ తర్వాత కమల్ హాసన్.. తమిళనాడు ఎన్నికల్లో బిజీ కావడంతో ఈ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ సమయంలో శంకర్, దిల్ రాజు నిర్మాణంతో రామ్ చరణ్ హీరోగా సినిమాను అనౌన్స్ చేసాడు. అంతేకాదు.. తాజాగా రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘అపరిచితుడు’ హిందీ రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇంతలోనే అపరిచితుడు నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ కోర్టుకు కెక్కాడు. దీనిపై శంకర్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా కథ నాది. ఈ విషయమై ఎంత దూరమైన వెళతానని చెప్పాడు.

  Shankar,Shankar twitter,Shankar anniyan hindi remake ranveer singh,Shankar V Ravichandran anniyan producer,anniyan producer V Ravichandran sends legal notice to shankar,telugu cinema,శంకర్,శంకర్‌కు లీగల్ నోటీస్ పంపిన ఆస్కార్ వి రవిచంద్రన్,శంకర్ అన్నియన్ రీమేక్
  శంకర్ రణ‌్‌వీర్ సింగ్ (Shankar, Ranveer Singh)

  ఈ మధ్యలో లైకా ప్రొడక్షన్స్ వాళ్లు.. శంకర్‌కు నోటీసులు పంపించారు. ముందుగా మాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం .. ‘ఇండియన్ 2’ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత కానీ వేరే సినిమా చేయడానికి వీలు లేదు. ఈ క్రమంలో తమ సంస్థతో శంకర్ చేసుకున్న ఒప్పందం ప్రకారం వేరే ప్రాజెక్ట్ టేకప్ చేయకుండా లైకా ప్రొడక్షన్స్ వాళ్లు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

  dil raju pan indian movies,dil raju,dil raju twitter,dil raju instagram,dil raju movies,dil raju ram charan shankar movie,dil raju prabhas prashanth neel movie,dil raju vijay prashanth neel movie,telugu cinema,దిల్ రాజు,దిల్ రాజు భారీ సినిమాలు,దిల్ రాజు రామ్ చరణ్ శంకర్ సినిమా,దిల్ రాజు ప్రభాస్ ప్రశాంత్ నీల్ సినిమా,దిల్ రాజు విజయ్ ప్రశాంత్ నీల్ సినిమా
  రామ్ చరణ్ శంకర్ (Ram Charan Shankar)

  ప్రస్తుతం రామ్ చరణ్.. తన తర్వాత ప్రాజెక్ట్‌ను శంకర్‌తో కాకుండా సుకుమార్‌తో చేయనున్నాడు. ఈ విషయమై సుకుమార్ అఫీషియల్ ప్రకటన విడుదల చేసాడు. రామ్ చరణ్ కూడా ముందుగా మీరు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత తన దగ్గరకు రమ్మని చెప్పాడట. దీంతో శంకర్ ముందుగా ‘ఇండియన్ 2’ సినిమా మిగిలిన పార్ట్‌ను కంప్లీట్ చేయనున్నాడు. ఇండియన్ 2 మొదలు పెట్టకపోవడానికి గల కారణాలను శంకర్ ..కోర్టుకు వివవరించాడట. ఈ సినిమా కోసం విదేశీ సాంకేతిక నిపుణులు రావాలి. కానీ కోవిడ్ కారణంగా వారు మన దేశానికి రావడానికి భయపడుతున్నారట. వాళ్లు వచ్చిన తర్వాత ‘ఇండియన్ 2’ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తామని శంకర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలియజేసారు.

  pawan kalyan,ram charan,pawan kalyan ram charan shankar movie,ram charan pawan kalyan shankar multistarrer movie,pawan kalyan movies,pawan kalyan ram charan multistarrer movie details,shankar to direct ram charan pawan kalyan,ram charan pawan kalyan multi starrer movie,ram charan pawan kalyan,ram charan pawan kalyan movie,pawan kalyan and ram charan,రామ్ చరణ్,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ శంకర్ సినిమా,శంకర్ దర్శకత్వంలో చరణ్ పవన్ మల్టీస్టారర్
  కమల్ హాసన్ (Kamal Haasan Shankar Indian 2)

  ఇక కమల్ హాసన్.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను జూన్‌లోపు కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో కమల్ హాసన్.. జూన్ నుంచి ‘ఇండియన్ 2’ సినిమా కోసం డేట్స్ కేటాయించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా విదేశీ నిపుణులను మన దేశానికి రప్పించే బాధ్యతను శంకర్ తీసుకోనున్నాడు. ఇక లైకా ప్రొడక్షన్స్ వాళ్లు కూడా ఈ సినిమాను వీలైనంత తొందరలో పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా కంప్లీట్ కాగానే..రణ్‌వీర్ సింగ్‌తో ‘అపరిచితుడు’ రీమేక్ పట్టాలెక్కించనున్నాడు. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ సినిమా పట్టాలెక్కనుంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood news, Dil raju, Indian 2, Kamal haasan, Kollywood, Ram Charan, Ranveer Singh, Shankar, Tollywood

  ఉత్తమ కథలు