భారతీయుడు ప్రమాదం మరువక ముందే దర్శకుడు శంకర్‌క‌ు భారీ షాక్..

ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచం మొత్తం కరోనాపై పోరాడుతోంది. ఆ సంగతి పక్కనపెడితే.. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన అరుణ్ ప్రశస్త్ ఈ రోజు రోడ్డు ప్రమాదంలో  కన్నుమూసారు.

news18-telugu
Updated: May 15, 2020, 6:18 PM IST
భారతీయుడు ప్రమాదం మరువక ముందే దర్శకుడు శంకర్‌క‌ు భారీ షాక్..
అరుణ్ ప్రశస్త్: శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ్ ప్రశస్త్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈయన తొలి సినిమా ఇంకా విడుదల కాలేదు.
  • Share this:
ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచం మొత్తం కరోనాపై పోరాడుతోంది. ఆ సంగతి పక్కనపెడితే.. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన అరుణ్ ప్రశస్త్ ఈ రోజు రోడ్డు ప్రమాదంలో  కన్నుమూసారు. ఆయన బైకును లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవిచింది. ఈ ప్రమాదం చెన్నై కోయంబత్తూర్ ప్రధాన రహదారిలో ఉన్న మెట్టుపాల్యం దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది.  ఆయన మృతిని శంకర్‌ను తీవ్రంగా కలిచి వేసింది. ఈ సందర్భంగా ఆయన ఆయన ఫోటోను శంకర్ ట్విట్టర్‌లో షేర్ చేసాడు. అరుణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తన కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టు చెప్పకొచ్చాడు. ఎపుడు పాజిటివ్ ఆలోచనలతో కెరీర్‌లో ఎపుడు ముందుకు సాగేవాడంటూ ఆయన పనితనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఆయన ఆత్మకు శాంతి కలగలని  ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి తెలియజేసాడు. అంతకు ముందు శంకర్, కమల్ హాసన్ భారతీయుడు 2 చిత్ర షూటింగ్ సమయంలో క్రేన్ విరిగిపడటంతో పెద్ద ప్రమాదం జరిగింది.


ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. అందులో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. మృతుల్లో ఒకరు 29 ఏళ్ల మధు.. మరొకరు 34 ఏళ్ల కృష్ణ ఉన్నారు. 60 ఏళ్ల చంద్రన్ ప్రొడక్షన్ అసిస్టెంట్ ఉన్నారు. తాజాగా అరుణ్ ప్రశస్త్ మృతితో శంకర్ దగ్గర పనిచేసే మూడు అసిస్టెంట్ దర్శకుడు కన్నుమూయడం విచారకరం.
First published: May 15, 2020, 6:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading