DIRECTOR SHANKAR AND RAM CHARAN RC15 MOVIE TITLE UPDATE SB
Ram Charan:మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. RC15 టైటిల్ లాక్..!
Photo Twitter
అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్.ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదర్చుకుందని తెలుస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..RRR వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తర్వాత చేస్తున్న సినిమా RC15. దర్శకుడు శంకర్ టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. అయితే ఆర్సీ 15 సినిమలో రామ్ చరణ్ త్రిబుల్ రోల్లో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా టైటిల్ కూడా ఇటీవల డైరెక్టర్ శంకర్ లాక్ చేసినట్లు టాక్. '
తాజాగా ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి సర్కారోడు అనే టైటిల్‌ను శంకర్ టీం పరిశీలిస్తుందట. అయితే ప్రస్తుతానికి ఈ న్యూస్ వైరల్ అవుతున్నా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సర్కారోడు', 'అధికారి' అనే టైటిల్స్ పరిశీలనలో ఉండగా, ఫైనల్ గా 'అధికారి' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా
షూటింగ్ రాజమండ్రిలోని అందమైన ప్రదేశాల్లో కూడా నిర్వహించారు.
పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజోలు సుందరి అంజలి, కన్నడ యాక్టర్ జయరామ్, టాలీవుడ్ యాక్టర్ నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో చరణ్ కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్.
ఈ పిక్చర్ పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. విడుదలకు ముందే ఈ చిత్ర నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE చానెల్ దాదాపు రూ.150 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదర్చుకుందని తెలుస్తోంది. ఆర్సీ 15 సినిమా షూటింగ్లో తాను చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు రామ్ చరణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దర్శకుడు శంకర్ ఫ్యాన్ బాయ్ గా ..సినిమాలో తన పాత్ర పరిధి మేరకు నటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. శంకర్ దర్శకత్వంలో పని చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్న చరణ్..డెఫినెట్ గా సినిమా చాలా బాగుంటుందని తెలిపారు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.