Home /News /movies /

DIRECTOR SEKHAR KHAMMULA THANKS TELANGANA GOVT FOR SHOWING GANDHI FILM TO CHILDREN SB

Sekhar kammula: తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన శేఖర్ కమ్ముల..!

శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల

ఇవాళ దేవి థియేటర్ లో గాంధీ మూవీని వందల మంది విద్యార్థులతో కలిసి చూశాను. ఇదొక మర్చిపోలేని అనుభవం అన్నారు శేఖర్ కమ్ముల.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల అందరికీ పరిచయమే.  తాజాగా ఆయన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.  75 ఏళ్ల భారత స్వతంత్య్ర వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ సినిమా థియేటర్లలో ఉదయం ఆట గాంధీ చిత్రాన్ని చూపిస్తున్నది. ఈ షో ను హైదారాబాద్ దేవి థియేటర్ లో విద్యార్థులతో కలిసి చూశారు దర్శకుడు శేఖర్ కమ్ముల. వందల మంది విద్యార్థులతో గాంధీ సినిమా చూడటం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందంటూ ఆయన స్పందించారు.

    భారత స్వతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ దేవి థియేటర్ లో గాంధీ మూవీని వందల మంది విద్యార్థులతో కలిసి చూశాను. ఇదొక మర్చిపోలేని అనుభవం. గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహంలో భాగంగా ఈ చిత్రంలో వచ్చే సన్నివేశాలకు దేశభక్తితో పిల్లలు స్పందిస్తున్న తీరు చూస్తుంటే గర్వంగా అనిపిస్తోంది. ఇలాంటి కార్యక్రమంలో భాగమవడం సంతోషంగా ఉంది. మీరూ గాంధీ సినిమాను చూడండి. అని శేఖర్ కమ్ముల ట్వీట్ చేశారు.


    ఇక శేఖర్ కమ్ముల విషయానికి వస్తే.. ఆయన తెలుగు తెరపై ఎన్నో మంచి సినిమాల్ని అందించారు. దర్శకుడిగా ఆయన మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్. ఈ సినిమాకు ఆయనకు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారము లభించింది.. తరువాత ఆయన దర్శకత్వం వహించిన ఆనంద్ సినిమా ఆయనకు మంచి కమర్షియల్ విజయాన్నిచ్చింది. సినిమాల్లో సాధారణంగా కనిపించే హింస, అశ్లీలత మొదలైనవి శేఖర్ సినిమాల్లో తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి కుటుంబ సమేతంగా చూడదగ్గవిగా ఉంటాయి.

    రానాను మొదటి సినిమాలనే సీఎం చేస్తూ.. లీడర్ లాంటి మంచి డెబ్యూ మూవీని అందించారు శేఖర్ కమ్ముల. ఆ తర్వాత హ్యాపీ డేస్ అంటూ... కాలేజ్ లైఫ్ మీద అద్భుతమైన సినిమా తీశారు. ఈ సినిమాతో ఆయన పలువురు నటుల్ని టాలీవుడ్‌కు పరిచయం చేశారు.  సాయిపల్లవికి కూడా తెలుగులో తొలి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ శేఖర్ కమ్ములనే కావడం విశేషం. ఇక గోదావరి అనే పేరుతో ఆయన తీసిన సినిమా కూడా ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇటీవలే నాగచైతన్య సాయిపల్లవి జంటగా లవ్ స్టోరీ సినిమాను కూడా తెరకెక్కించారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Sekhar kammula, Telangana govt

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు