• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • DIRECTOR SEKHAR KAMMULA ADDRESSING A SENSATIONAL POINT IN SAI PALLAVI NAGA CHAITANYA LOVE STORY MOVIE PK

Sai Pallavi Love Story: ‘లవ్ స్టోరీ’ సినిమాలో అమ్మాయిల ఆ ఇష్యూ చూపిస్తున్న శేఖర్ కమ్ముల..

నాగ చైతన్య సాయి పల్లవి (Naga chaitanya Sai Pallavi)

Sai Pallavi Love Story: లవ్ స్టోరీ (Love Story) సినిమాలో శేఖర్ కమ్ముల (Sekhar Kammula) ఓ సంచలన పాయింట్ తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు తెలుగులో ఏ దర్శకుడు చెప్పిన కథను ఇందులో చూపించబోతున్నాడు. ప్రతీ అమ్మాయి తమ యవ్వన దశలో ఎదుర్కొనే సమస్యను ఇందులో చూపించబోతున్నాడు కమ్ముల.

  • Share this:
ఫిదా లాంటి క్లాసిక్ సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్నాడు శేఖర్ కమ్ముల. ఈయన నుంచి సినిమా రావాలంటే ఇన్ని రోజులు ఆగాల్సిందే. ఒక్కో సినిమా కోసం కనీసం రెండు మూడేళ్లు తీసుకోవడం ఈయనకు అలవాటు. అలాగే ఎలాంటి కథ అయినా కూడా అంతే సున్నితంగా చూపించడం కూడా కమ్ములకే చెల్లింది. ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాలో కూడా ఇదే చేయబోతున్నాడు. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల సినిమాలపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమాకు రిలీజ్‌కు ముందే 40 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. గతంలో శేఖర్ కమ్ముల సినిమాలు వస్తే అంత బిజినెస్ చేసేవి కావు కానీ ఇప్పుడు అలా కాదు. కమర్షియల్‌గా కూడా ఈయన సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఫిదా తర్వాత ఈయన సినిమాల రేంజ్ కూడా పెరిగిపోయింది. తన సినిమాల్లో సున్నితమైన భావోద్వేగాలను అత్యంత సున్నితంగా తెరపై చూపిస్తుంటాడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు లవ్ స్టోరీ కూడా రియలిస్టిక్ కథతోనే రాబోతున్నాడు. లవ్ స్టోరి నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సారంగ దరియా పాట అయితే యూ ట్యూబ్ లో రికార్డులు తిరగరాస్తుంది.

మరోవైపు ఈ సినిమాకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ప్రాణంగా నిలుస్తుంది. ఫిదా తర్వాత మరోసారి తెలంగాణ నేపథ్యంలోనే ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. లవ్ స్టోరీ షూటింగ్ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ చేసాడు దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు.
sekhar kammula,love story movie,sai pallavi,sai pallavi twitter,sekhar kammula girls periods love story movie,sai pallavi sekhar kammula,sai pallavi love story movie,శేఖర్ కమ్ముల,శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాలో సెన్సేషనల్ పాయింట్,శేఖర్ కమ్ముల సాయి పల్లవి నాగ చైతన్య లవ్ స్టోరీ
నాగ చైతన్య సాయి పల్లవి లవ్ స్టోరీ (Naga Chaitanya Sai Pallavi love story)

ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఓ సంచలన పాయింట్ చూపించబోతున్నాడు శేఖర్ కమ్ముల. ఇప్పటి వరకు తెలుగులో ఏ దర్శకుడు చెప్పిన కథను ఇందులో చూపించబోతున్నాడు. దానికి ప్రేమకథను జోడించి కథ తెరకెక్కిస్తున్నాడు. ప్రతీ అమ్మాయి తమ యవ్వన దశలో ఎదుర్కొనే వ్యక్తిగత సమస్యను ఈ సినిమాలో చూపించబోతున్నాడు కమ్ముల.

ఈ కాన్సెప్టును కేవలం యాడ్స్ రూపంలో చూపించడమే కానీ సినిమాలో ఎవరూ అడ్రస్ చేయలేదు. కానీ శేఖర్ కమ్ముల ఇదే కథను చూపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. శేఖర్ కమ్ముల కచ్చితంగా ఈ సినిమాను అందరి మెప్పు పొందేలా తెరకెక్కిస్తాడని నమ్ముతున్నారు చిత్రయూనిట్. ఎప్రిల్ 16న ఈ చిత్రం విడుదల కానుంది.
Published by:Praveen Kumar Vadla
First published: