news18-telugu
Updated: July 7, 2020, 10:51 PM IST
విజయ్ దేవరకొండ Photo : Twitter
హిట్టు కాంబినేషన్.. ఒక హీరో, దర్శకుడి కాంబినేషన్లో ఒక సినిమా హిట్టైయితే చాలు.. వెంటనే అదే కాంబినేషన్లో మరో సినిమాకు పట్టాలెక్కడం ఇండస్ట్రీలో జరగుతూనే ఉంటుంది. తాజాగా విజయ్ దేవరకొండ తనకు హిట్టు ఇచ్చిన దర్శకుడితో మరోసారి పనిచేయడానికి రెడీ అవుతున్నాడు. విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డితో’ ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్లో తనదైన శైలిలో మెప్పించాడు.విజయ్ దేవరకొండను రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మార్చేసిన సినిమా 'అర్జున్ రెడ్డి'. మెడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ అయి అక్కడ కూడా సంచలనాలు సృష్టించింది అర్జున్ రెడ్డి. అలాంటి సంచలన కాంబినేషన్ మరోసారి రిపీట్ అయితే అంతకంటే అభిమానులకు కావాల్సిందేం ఉంది.

విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా (File/Photo)
ఇప్పుడు అదే జరగబోతుందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండతో మరో సినిమాకు సందీప్ రెడ్డి వంగా సిద్ధమవుతున్నాడని ప్రచారం జరుగుతుంది. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్‌తో బాలీవుడ్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్.ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో ‘ఫైటర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండకు బాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే ఉంది. ఇపుడు ‘ఫైటర్’తో బాలీవుడ్ బాట పడుతున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే.. హిందీలో కూడా విజయ్ దేవరకొండకు క్రేజ్ పెరగడం ఖాయం. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ మరోసారి సందీప్ రెడ్డి వంగాతో పాన్ ఇండియా మూవీ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

సందీప్ రెడ్డి వంగా విజయ్ దేవరకొండ (sandeep reddy vijay devarakonda)
కబీర్ సింగ్ మూవీతో సందీప్ రెడ్డికి బాలీవుడ్లో మంచి మార్కెట్ ఏర్పడింది. ఐతే.. విజయ్ దేవవరకొండతో చేయబోయే సినిమా కోసం సందీప్ రెడ్డి వంగా ఇప్పటి వరకు తెరకెక్కని డిఫరెంట్ జానర్లో స్టోరీ రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఇక సందీప్ రెడ్డి.. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. మొత్తానికి అర్జున్ రెడ్డి కాంబో రిపీట్ అయితే చూడాలనుకునే ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
July 7, 2020, 10:51 PM IST