Home /News /movies /

DIRECTOR SAMPATH NANDI CONTRIBUTES AN AMOUNT OF 5 LAKH RUPEES TOWARDS THE CORONA CRISIS CHARITY TA

కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం సంపత్ నంది తన వంతు సాయం..

సంపత్ నంది: కరీంనగర్ (రచ్చ)

సంపత్ నంది: కరీంనగర్ (రచ్చ)

సమాజం నుండి మనం తీసుకోవడమే కాదు.. ఆ సమాజానికి ఏదైన కష్టం కలిగితే తమ వంతు సాయం చేయడానికి కూడా ముందుకు రావాలి. తాజాగా కరోనా పై పోరాటంలో భాగంగా దర్శకుడు సంపత్ నంది తన వంతు విరాళం ప్రకటించారు.

    సమాజం నుండి మనం తీసుకోవడమే కాదు.. ఆ సమాజానికి ఏదైన కష్టం కలిగితే తమ వంతు సాయం చేయడానికి కూడా ముందుకు రావాలి. ఇపుడు మన సెలబ్రిటీలు అదే చేస్తున్నారు. ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి తమ ఔదార్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులకు పని లేకుండా పోయింది. దీంతో వారిని ఆదుకోవడం కోసం సినీ ఇండస్ట్రీ కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసారు. ఇందులో భాగంగా ప్రముఖ నటులు చాలా మంది ఈ ఛారిటీకి తమ విరాళాలు అందించారు. తాజాగా కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం దర్శకుడు సంపత్ నంది రూ. 5 లక్షల విరాళం ప్రటించాడు. మన దేశం కరోనా వ్యతిరేక పోరాటంలో సక్సెస్ సాధించాలని కోరారు. ప్రస్తుతం సంపత్ నంది.. గోపీచంద్, తమన్నాలతో ‘సీటీమార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Coronavirus, Covid-19, Sampath Nandi, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు