DIRECTOR RAM GOPAL VARMAS FANTASTIC BIRTHDAY GIFT TO CHANDRABABU NAIDU TA
చంద్రబాబుకు అదిరిపోయే బర్త్ డే గిప్ట్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ..
రామ్ గోపాల్ వర్మ, చంద్రబాబు నాయుడు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చంద్రబాబు నాయుడుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు వైసీయర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బర్త్ డే విషెస్ చెప్పారు. మరోవైపు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చంద్రబాబు నాయుడుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు వైసీయర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బర్త్ డే విషెస్ చెప్పారు. మరోవైపు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే...‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసాడు వర్మ. అంతేకాదు ఈ సినిమాలో చంద్రబాబు క్యారెక్టర్‌ను విలన్ చేసి తాను అనుకున్నది చేసాడు. ఇపుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ నేపథ్యంలో ‘టైగర్ కేసీఆర్’ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సంచలనం సృష్టించాడు. ఈ సినిమాకు అగ్రెసివ్ గాంధీ అనే క్యాప్షన్ కూడా పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అంటూ తెలుగులో ఉప శీర్షిక కూడా పెట్టాడు. ఈ సినిమాలో కూడా రామ్ గోపాల్ వర్మ మరోసారి చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసాడు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసాడు.
ఈ పోస్ట్‌లో వర్మ.. మా భాష మీద నవ్వినం..మా ముఖాల మీద ఊసినవ్. మా బాడీల మీద నడిసిన ఆంధ్రుడా ..వస్తున్నా..తాట తీయనీకి వస్తున్న అంటూ టైగర్ కేసీఆర్ వస్తుండు అంటూ ఒక వీడియో రిలీజ్ చేసాడు. ఈ వీడియోలో వర్మ మరోసారి చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసినట్టు కనబడింది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చంద్రబాబును విలన్ చేసినట్టే ఇపుడు ‘టైగర్ కేసీఆర్’ బయోపిక్‌లో చంద్రబాబు పాత్రనే విలన్‌గా చూపించబోతున్నట్టు వర్మ హింట్ ఇచ్చాడు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు..వైసీపీలో జాయిన్ అవుతున్నట్టు ఒక మార్ఫింగ్ ఫోటోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రామ్ గోపాల్ వర్మ పై కేసు బుక్ అయింది. మొత్తానికి ఏపీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వర్మ..చంద్రబాబును ఆయన పుట్టినరోజున టార్గెట్ చేయడం సినీ,రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.