Kiran Kumar ThanjavurKiran Kumar Thanjavur
|
news18-telugu
Updated: April 8, 2019, 1:20 PM IST
బిగ్‌బీతో ఆర్జీవి
అవును బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్‌కు ఇపుడు రామ్ గోపాల్ వర్మ కాంపీటీటర్గా మారాడు. ఏమిటి నటనలో బిగ్‌బీకి వర్మ కాంపీటీటర్గా మారటం ఏమిటి అనుకుంటున్నారా .. ఏమి లేదు. ఇప్పటి వరకు దర్శకుడిగా, కథకుడిగా, నిర్మాతగా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా..గాయకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ.ఇప్పటి వరకు తెర వెనక స్టార్ట్, కెమెరా, యాక్షన్ అంటూ నటీనటులను డైరెక్ట్ చేసే రామ్ గోపాల్ వర్మ తొలిసారి ముఖానికి మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. గన్‌షాట్ ఫిలింస్ అనే సంస్థ తొలి ప్రయత్నంగా ‘కోబ్రా’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతుంది. ఈ సినిమాను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బయోపిక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ..ఒక ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్ పాత్ర కూడా ఉందని సమాచారం. ఈసినిమాను లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు ఒక దర్శకుడిగా వ్యవహరించిన అగస్త్య మంజుతో కలిసి రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు.

కోబ్రాలో రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ దర్శకుడి నుంచి నటుడిగా మారడంపై అమితాబ్ తనదైన శైలిలో స్పందించాడు. అంతెేకాదు నటుడిగా మారిన వర్మకు బిగ్ బీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతేాకాదు తనకో కొత్త కాంపీటీటర్ వచ్చారంటూ ట్వీట్ చేసాడు.
మొత్తానికి రామ్ గోపాల్ వర్మ నటుడిగా మారడంతో అమితాబ్ బచ్చన్ తనదైన శైలిలో ట్వీట్ చేయడం ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
First published:
April 8, 2019, 1:20 PM IST