ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఆయన కొత్త సినిమా అప్డేట్స్తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనున్న ఎన్టీఆర్ 31 పోస్టర్‌తో నందమూరి అభిమానులకు కిక్కిచ్చారు మేకర్స్. అయితే ఈ పోస్టర్‌పై తనదైన కోణంలో కామెంట్ వదిలారు రామ్ గోపాల్ వర్మ.
నేడు (మే 30) యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు (NTR Birthday) కానుకగా కొత్త సినిమాల అప్డేట్స్ ఇస్తూ నందమూరి అభిమానులను ఖుషీ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం కొరటాల శివ (Koratala Siva), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో వరుసగా రెండు సినిమాలను లైన్లో పెట్టారు ఎన్టీఆర్ (Ntr). అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజుకు ఒక రోజు ముందే డైరెక్టర్ కొరటాల శివ ఓ స్పెషల్ వీడియో వదిలి నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించారు. ఇక నేడు (శుక్రవారం) ప్రశాంత్ నీల్ తన ప్రాజెక్ట్ నుంచి తారక్ (Tarak) లుక్‌తో కూడిన కొత్త పోస్టర్ రిలీజ్ చేసి నందమూరి ఫ్యాన్స్‌ని మరింత హూషారెత్తించారు. విడుదలైన కాసేపట్లోనే ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో అదే పోస్టర్ షేర్ చేస్తూ ఆర్జీవీ (Rgv) కామెంట్స్ చేయడం హాట్ ఇష్యూగా మారింది.
ఇటీవలే కేజీఎఫ్ 2 సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో మరో భారీ సినిమా రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ 31గా ఈ సినిమా సెట్స్ మీదకు రానుంది. ఈ పాన్ ఇండియా సినిమాను భారీ బడ్జెట్ కేటాయించి మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఓ పవర్ ఫుల్ పోస్టర్ వదిలారు మేకర్స్. ఎన్టీఆర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌తో చిత్రంలో ఎన్టీఆర్ రోల్ ఎలా ఉండబోతుందనే దానిపై హింటిచ్చారు. కోరమీసం, గుబురు గడ్డంతో ఊర మాస్ లుక్‌లో ఎన్టీఆర్‌ని చూపించడంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు మిన్నంటాయి.
అయితే ఈ మధ్యకాలంలో బడా హీరోల సినిమాపై కామెంట్స్ చేస్తూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ NTR31పై కూడా రియాక్ట్ అయ్యారు. తారక్ సినిమాల్లో ఇది నా మోస్ట్ అవైటెడ్ మూవీ అని కామెంట్ చేస్తూ NTR31 పోస్టర్ షేర్ చేశారు. ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ చూసి నందమూరి ఫ్యాన్స్ పాజిటివ్ రియాక్షన్ ఇస్తుండగా ఇంకొందరు మాత్రం నెగెటివ్‌గా స్పందిస్తున్నారు. నీకు మెగా హీరోల సినిమాలు తప్ప అందరివీ నచ్చుతాయంటూ సెటైరికల్ కామెంట్స్ వదులుతున్నారు.
తాజాగా వదిలిన పోస్టర్ని బట్టి చూస్తే NTR31 మూవీ మాస్ ఆడియన్స్‌కి ఊహించని కిక్కిస్తుందని అర్థమవుతోంది. ఎన్టీఆర్ కెరీర్లోనే ఇలాంటి గెటప్‌లో కనిపించడం ఇదే తొలిసారి కావడం ఆయన ఫ్యాన్స్‌లో సినిమా పట్ల క్యూరియాసిటీ మరింత పెరిగింది. మొత్తానికి ఇది కూడా కేజీఎఫ్ తరహాలోనే హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా రానుందని మాత్రం స్పష్టమవుతోంది. ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. వచ్చే ఏడాది చిత్రాన్ని ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారు.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.