‘టైగర్ కేసీఆర్’ బయోపిక్‌ పై వర్మ క్లారిటీ.. వాళ్లే టార్గెట్ అంటూ ట్వీట్..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బర్త్ డే గిఫ్ట్ అంటూ  ‘టైగర్ కేసీఆర్’ మూవీకి సంబంధించి వెన్నుపోటు పాటను రిలీజ్ చేసి పెద్ద సంచలనమే సృష్టించాడు.తాజాగా ఈ పాటపై వస్తోన్న విమర్శలకు వర్మ క్లారిటీ ఇచ్చారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 22, 2019, 8:46 PM IST
‘టైగర్ కేసీఆర్’ బయోపిక్‌ పై వర్మ క్లారిటీ.. వాళ్లే టార్గెట్ అంటూ ట్వీట్..
వర్మ కేసీఆర్ బయోపిక్
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 22, 2019, 8:46 PM IST
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బర్త్ డే గిఫ్ట్ అంటూ  ‘టైగర్ కేసీఆర్’ మూవీకి సంబంధించి వెన్నుపోటు పాటను రిలీజ్ చేసి పెద్ద సంచలనమే సృష్టించాడు. ఈ పాటలో మా భాష మీద నవ్వినం..మా ముఖాల మీద ఊసినవ్. మా బాడీల మీద నడిసిన ఆంధ్రుడా ..వస్తున్నా..తాట తీయనీకి వస్తున్న అంటూ టైగర్ కేసీఆర్ వస్తుండు అంటూ ఒక వీడియో రిలీజ్ చేసాడు. ఈ వీడియోపై రామ్ గోపాల్ వర్మ పై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది. దీంతో రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా మరోసారి వివరణ ఇచ్చుకున్నాడు. కేసీఆర్ తన పోరాటాన్ని ఆంధ్ర ప్రజలపై కాకుండా.. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచిన, మోసం చేసిన ఆంధ్రానాయకులపైనే ఈ చిత్రం ఉంటుందని వర్మ చెప్పుకొచ్చాడు. కేసీఆర్‌కు తెలుగు ప్రజలంటే ప్రేమ ఉంది. ఆయన పోరాట మంతా తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఆంధ్రా నాయకులపైనే అంటూ వివరణ ఇచ్చాడు.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తాను టార్గెట్ చేయాలనకున్న చంద్రబాబు, బాలకృష్ణలను బాగానే టార్గెట్ చేసాడు. ఈ సినిమా ఫ‌లితంతో ప‌ని లేకుండా విడుద‌ల‌కు ముందు నుంచే సంచ‌ల‌నాలు సృష్టించింది. ఇప్ప‌టికీ ఆంధ్రప్రదేశ్‌లో ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుద‌ల కాలేదంటే అక్క‌డ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎంత‌లా ఇంపాక్ట్ చేసిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇపుడు మరోసారి ‘టైగర్ కేసీఆర్’ బయోపిక్‌తో మరోసారి చంద్రబాబే..రామ్ గోపాల్ వర్మ టార్గెట్ చేయనున్నట్టు తెలుస్తోంది.
First published: April 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...