Home /News /movies /

DIRECTOR RAM GOPAL VARAM ONCE AGAIN START COUNTERS ON AP GOVERNMENT HE QUESTIONED WHO WILL KILL KATTAPPA NGS

RGV: కట్టప్పను ఎవరు చంపారు..? మళ్లీ ట్విట్టర్ లో సర్కార్ పై వర్మ సెటైర్లు

రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ

RGV Counter: మంత్రి పేర్ని నానితో సుమారు రెండున్నర గంటల పాటు సమావేశం అయ్యారు.. ఆ చర్చలపై వందశాతం సంతోషం వ్యక్తం చేశారు.. టికెట్ల వ్యవహారం త్వరలోనే కొలిక్కి వస్తుందని నమ్మకంగా చెప్పారు. కానీ 24 గంటలు గడవకముందే ఏపీ ప్రభుత్వంపై మళ్లీ సైటర్లు ప్రారంభించారు.. కట్టప్పను ఎవరు చంపారంటూ పోస్ట్ పెట్టారు..

ఇంకా చదవండి ...
    RGV Counter to  Government:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో  సినిమా టికెట్ల వ్యవహారం (Movie Tickets Issue) పై నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టికెట్ల ధర నిర్ణయంపై ప్రభుత్వం నియమంచిన కమిటీ ఇవాళ తొలిసారి ఫిజికల్ గా సమావేశం అవుతోంది. ఇప్పటికే వరకు వర్చువల్ గా సమావేశమైన కమిటీ నేడు నేరుగా సమావేశం అవుతోంది. ఇప్పటి వకు టాలీవుడ్ (Tollywood) ఇతర రంగాల నుంచి వచ్చిన అభిప్రాయాలపై చర్చించి.. తుది నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఆ తరువాత ఏపీలో టికెట్ల రేట్ల పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఈ లోపే మంత్రి పేర్ని నాని - వర్మ రామ్ గోపాల్ వర్మ  (Ram Gopal Varma)మధ్య సోషల్ మీడియాలో యుద్దం జరిగింది. ఆ యుద్ధానికి స్మాల్ బ్రేక్ అంటూ.. నేరుగా మంత్రితో కలిసి సినిమా సమస్యలపై చర్చించారు.. సినిమా టికెట్లతో పాటు ఇతర అంశాలతో తన అభిప్రాయాలను మంత్రికి వివరించారు వర్మ.. అయితే మీటింగ్ తరువాత.. ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన అభిప్రాయాలను మంత్రి సానుకూలంగా విన్నారని త్వరలోనే టికెట్ల వ్యవహారం సద్దు మణుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు..

    మంత్రితో సమావేశంపై సంతోషం వ్యక్తం చేయడంతో..  ఏపీ ప్రభుత్వం-వర్మ మధ్య వివాదానికి పుల్ స్టాప్ పడుతుందని అంతా అనుకున్నారు.  కానీ వర్మ మరోసారి తనదైన స్టైల్లో  ఏపీ ప్రభుత్వంపై పంచ్ లు వేశారు. మన తెలుగు సినిమా అయిన సరే మహారాష్ట్రలో ఆర్ఆర్ఆర్ (RRR) టికెట్ ధర ను పెంచుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది... మరి ఏపీ ప్రభుత్వం సంగతి ఏంటి అంటూ వర్మ ప్రశ్నించారు..

    ఇదీ చదవండి : వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేసేది ఇక్కడ నుంచే.. స్కెచ్ భారీగానే ఉందిగా..?

    మహరాష్ట్రలో  RRR టిక్కెట్ ధర రూ. 2200/-గా  అక్కడి ప్రభుత్వం నిర్ణయించిందని..  అదే తెలుగు వారి సొంత రాష్ట్రంమైన ఆంధ్రప్రదేశ్ లో తమ సినిమా టికెట్ ధరను కనీసం   200/- రూపాయలు  కూడా అమ్మలేకపోతున్నారు. ఇది తెలుగు వారి అస్తిత్వం గురించి ప్రశ్నను లేవనెత్తుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి  “కట్టప్పను ఎవరు చంపారు? ” అంటూ..  ట్వీట్ చేశారు.



    వర్మ ఉద్దేశం  ప్రకారం..  ఎవరు మన తెలుగు  సినిమా ఇండస్ట్రీని చంపేస్తున్నారంటూ ఇన్ డైరెక్ట్ గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీరుని తప్పు పట్టారు. మరి సోమవారం మంత్రి పేర్ని నానితో రామ్ గోపాల్ వర్మ టికెట్ ధర విషయంపై భేటి అయి.. సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. మళ్లీ ఎందుకు ఇలా సెటైర్లు మొలు పెట్టారో అర్థం కావడం లేదంటున్నారు వైసీపీ అభిమానులు.

    ఇదీ చదవండి : విందులు, వినోదాలకు దూరంగా ఉండడండి.. సంక్రాంతిని ఇంట్లోనే జరుపుకోండి.. పవన్ సూచన

    మంత్రితో సమావేశం ముగిసిన వెంటనే కూడా వర్మ విమర్శలు చేశారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలు వాయిదాకు ఏపీలో టికెట్ల వ్యవహరామే కారణమని అభిప్రాయపడ్డారు. అయితే దానిపై మంత్రి వెంటనే వివరణ ఇచ్చారు. కేవలం కరోనా విస్తరణ నేపథ్యంలో ఆ సినిమాలు వాయిదా పడ్డాయి అన్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap minister perni nani, AP News, Ramgopal varma, RRR, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు