‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌పై ప్రభుత్వానికి రాజమౌళి రిక్వెస్ట్..

RRR

సాధ్యమైనంత తొందరగా ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ను మళ్లీ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు చిత్ర దర్శకుడు రాజమౌళి.

  • Share this:
    లాక్‌డౌన్ కారణంగా అన్నీ ఆగిపోయినట్టే టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా ఆగిపోయింది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా సమ్మర్‌కు వాయిదా పడింది. అయితే సాధ్యమైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్‌ను మళ్లీ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు చిత్ర దర్శకుడు రాజమౌళి. ఇదే విషయాన్ని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి చెప్పినట్టు తెలుస్తోంది. తెలంగాణలో సినిమా షూటింగ్స్‌, ధియేటర్లు తెరుచుకోవడం వంటి అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సినీ ప్రముఖలు సమావేశమయ్యారు. చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ భేటీకి రాజమౌళి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఆర్ఆర్ఆర్ షూటింగ్ అంశంపై రాజమౌళి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు విజ్ఞప్తి చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

    ఒకవేళ ఇప్పటికిప్పుడు సినిమా షూటింగ్స్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా... తక్కువ మందితో షూటింగ్స్ జరుపుకోవాల్సి ఉంటుందని మంత్రి తలసాని సినీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. అయితే తాము అందుకు కూడా సిద్ధమే అని... తక్కువ మందితో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ఈ సమావేశంలో వ్యాఖ్యానించినట్టు సమాచారం. చూస్తుంటే... సాధ్యమైనంత తొందరగా మళ్లీ ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ను పట్టాలెక్కించేందుకు రాజమౌళి ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: